News October 16, 2025
ఖమ్మం: భారంగా మారిన ఇసుక ధరలు.!

ఖమ్మం జిల్లాలో ఇసుక ధరలు భగ్గుమంటున్నాయి. బహిరంగ మార్కెట్లో టన్ను ఇసుక రూ.2,000 నుంచి 2,500 పలుకుతోంది. ఒక ఇంటి నిర్మానికి సుమారు 80 టన్నుల ఇసుక అవసరం అయితే దీనికే రూ.2 లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రజలు వాపోతున్నారు. ధరలను నియంత్రించాల్సిన జిల్లా అధికారులు వారికేం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీ ప్రాంతంలో ఇసుక ధరలు ఎలా ఉన్నాయి. COMMENT
Similar News
News October 17, 2025
ఆ ఆసుపత్రుల్లో ఆశించిన పురోగతి లేదు: ఖమ్మం కలెక్టర్

మెరుగైన సేవలతో ప్రభుత్వ వైద్యం పట్ల నమ్మకం కలిగించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల పనితీరుపై సమీక్షించారు. వైద్య విధానం పరిషత్ ఆసుపత్రులలో ప్రసవాలు జులైలో 47 నుంచి సెప్టెంబర్ 74కు చేరాయని, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి ఆసుపత్రిలో మంచి ఫలితాలు రాగా, కల్లూరు, వైరా, సత్తుపల్లి , పెనుబల్లి, మధిర ఆసుపత్రులలో ఆశించిన పురోగతి లేదన్నారు.
News October 17, 2025
పత్తి విక్రయాల్లో స్లాట్ బుకింగ్ విధానం: ఖమ్మం కలెక్టర్

ఖమ్మం: పత్తి రైతులు ఇకపై స్లాట్ బుకింగ్ పద్ధతిలో పంటను విక్రయించుకోవచ్చని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. రైతులు కపాస్ కిసాన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, సమీప జిన్నింగ్ మిల్లులో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. 8–12% తేమ ఉన్న పత్తికి రూ.8110–7786 మద్దతు ధర లభిస్తుందని పేర్కొన్నారు. స్లాట్ రద్దును 24 గంటల ముందుగానే చేసుకోవచ్చని కలెక్టర్ వివరించారు.
News October 16, 2025
ఖమ్మం: ‘వైద్య పరీక్షలకు బయటకు పంపితే కఠిన చర్యలు’

ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై సమీక్షించారు. ప్రజలకు ప్రభుత్వ వైద్యంపై విశ్వాసం పెరిగేలా మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రతి ఆసుపత్రిలో నెలకు కనీసం 200 ప్రసవాలు, ఓపీ కేసుల్లో 60% పరీక్షలు చేయాలన్నారు. వైద్య పరీక్షల కోసం రోగులను బయటకు పంపితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. అవసరమైన పరికరాల ప్రతిపాదనలు తక్షణమే పంపాలని ఆదేశించారు.