News October 16, 2025
పడిపోయిన అన్ని రకాల మిర్చి ధరలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధరలు మళ్లీ తగ్గాయి. తేజ మిర్చి క్వింటా బుధవారం రూ.14,850 ధర వస్తే.. నేడు రూ.14,450కి పడిపోయింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు నిన్న రూ.15,900 ధర పలకగా.. ఈరోజు రూ.15,500 కి తగ్గింది. వండర్ హాట్(WH) మిర్చికి బుధవారం రూ.16,500 ధర వస్తే.. నేడు రూ.16,200కి పతనమైంది. అలాగే దీపిక మిర్చికి రూ.14,800 ధర వచ్చింది.
Similar News
News October 17, 2025
చలికాలం వచ్చేస్తోంది.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు!

ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ చలి ఉండొచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఇలాంటి ఉష్ణోగ్రతల వల్ల శ్వాసకోస వ్యాధులు, ఫ్లూ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంటుంది. ‘చలిలో తిరగకుండా ఉంటే మంచిది. నూలు వస్త్రాలు, స్కార్ఫులు, క్యాప్, గ్లౌజులు ధరించడం మంచిది. వేడి ఆహారాన్నే తీసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో ముఖ్యం’ అని వైద్యులు సూచిస్తున్నారు.
News October 17, 2025
పోలీసుల విచారణలో నిజాలు వెలుగు చూస్తాయి: కలెక్టర్

పోలీస్ విచారణలో నిజాలు వెలుగు చూస్తాయని కలెక్టర్ కె.హైమావతి తెలిపారు. గురువారం హుస్నాబాద్ మండలం జిల్లెల్లగడ్డలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించి 10 రోజుల క్రితం మృతిచెందిన విద్యార్థి వివేక్ ఘటనపై సహ విద్యార్థులతో ఆరా తీశారు. ప్రిన్సిపల్‌ను సీసీ కెమెరాలు, రాత్రి విధుల్లో అధ్యాపకుల శ్రద్ధ, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
News October 17, 2025
లోకేశ్ ట్వీట్‌పై కర్ణాటక, తమిళనాడు నెటిజన్ల ఫైర్!

ఏపీకి వచ్చే పెట్టుబడులతో పొరుగు రాష్ట్రాలకు సెగ తగులుతోందన్న మంత్రి లోకేశ్ <<18020050>>ట్వీట్‌పై<<>> కర్ణాటక, తమిళనాడు నెటిజన్లు ఫైరవుతున్నారు. 2024-25లో తమిళనాడు వృద్ధి రేటు 11.19%గా ఉంటే APది 8.21% అని గుర్తు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. తమిళనాడు ఇండస్ట్రియల్ హబ్‌గా, బెంగళూరు ఐటీ క్యాపిటల్‌గా ఉందంటున్నారు. ఏపీ కొత్త రాష్ట్రం అని, గూగుల్ పెట్టుబడులు గొప్ప విషయం అని మరికొందరు లోకేశ్‌కు సపోర్ట్ చేస్తున్నారు.