News October 16, 2025

రేపు గుంతకల్లుకు సినీ తారలు

image

గుంతకల్లు పట్టణానికి రేపు సినీ తారలు రానున్నారు. పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో ఓ నూతన షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం చేయడానికి సినీ హీరోయిన్స్ ఐశ్వర్య రాజేశ్, రితిక నాయక్ వస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. రితిక నాయక్ ఇటీవల విడుదలైన మిరాయ్ చిత్రంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు.

Similar News

News October 16, 2025

పెద్దపల్లి: ‘రైతులు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు’

image

2025 అక్టోబర్ 16 వరకు 517 వ్యవసాయ విద్యుత్ సర్వీసులు విడుదల చేశామని పెద్దపల్లి సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ V. గంగాధర్ తెలిపారు. 3 నెలల్లో మరింత మంజూరు చేయడానికి ప్రయత్నిస్తామన్నారు. ఎక్కడా మెటీరియల్ కొరత లేదని, రైతులు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రతి దశలో స్టేటస్ మెసేజులు పంపి, పారదర్శకతతో సర్వీసులు అందిస్తున్నామని అన్నారు. సమస్యలు ఉంటే 1912 కి ఫోన్ చేయాలని కోరారు.

News October 16, 2025

లేటెస్ట్ సినిమా అప్‌డేట్స్

image

▸సుధీర్ బాబు నటించిన ‘జటాధర’ సినిమా ట్రైలర్‌ను రేపు విడుదల చేయనున్న మహేశ్ బాబు
▸వెట్రిమారన్, శింబు కాంబోలో వస్తోన్న ‘అరసన్'(తెలుగులో సామ్రాజ్యం) సినిమా ప్రోమోను రేపు రిలీజ్ చేయనున్న Jr.NTR
▸విక్రమ్ కె.కుమార్ డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ సినిమా చేసే అవకాశం?
▸ మెటా AIకి దీపికా పదుకొణె వాయిస్.. తొలి ఇండియన్ సెలబ్రిటీగా రికార్డు

News October 16, 2025

MNCL: ఓటర్ కార్డు దరఖాస్తులను పరిష్కరించాలి

image

రాష్ట్రంలో నూతన ఓటర్ కార్డులు ఓటర్ జాబితా సంబంధిత దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. హైదరాబాదు నుంచి ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితాలో 100 వయసు పైబడిన ఓటర్లను గుర్తించాలని, వారి వివరాలను తగిన ఆధారాలతో సమర్పించాలన్నారు.