News October 16, 2025

రంజీ DAY-2: పడ్డా.. తిరిగి నిలబడ్డ ఢిల్లీ

image

సొంతగడ్డపై జరుగుతున్న రంజీలో HYD, ఢిల్లీని ఆపలేకపోతోంది. ఓపెనర్ సాంగ్వాన్ 117*, ఆయూష్ దొసేజా 158* సెంచరీలతో అదరగొట్టారు. ఓవర్ నైట్ స్కోర్ 256/3తో ఇన్నింగ్స్ ఆరంభించిన ఢిల్లీ బ్యాటర్లు HYD బైలర్లను ఈజీగా ఎదుర్కొంటున్నారు. 2వ రోజు భారీ స్కోర్ చేసి డిక్లేర్ చేసేలా కనిపిస్తోంది. లంచ్ బ్రేక్ తర్వాత వికట్లు పడగొట్టి HYD నిలువరించగలదేమో చూడాలి. మిలింద్ 2, పున్నయ్ ఒక వికెట్ తీశారు.

Similar News

News October 17, 2025

NZB: గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

image

నిజమాబాద్‌లో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు మూడవ టౌన్ ఎస్ఐ హరిబాబు తెలిపారు. రైల్వే స్టేషన్ ప్రాంతంలో పెట్రోల్ నిర్వహిస్తుండగా పెంబోలి రైల్వే ట్రాక్ వద్ద ఓ వ్యక్తి పోలీసులు చూసి పారిపోతుండగా అదుపులోకి తీసుకున్నామన్నారు. అతడి నుంచి 110 గ్రాముల గంజాయి స్వాదినపరుచుకుని రిమాండ్‌కు తరలించమన్నారు.

News October 17, 2025

VKB: ఖాళీగా ఉన్న సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం

image

వికారాబాద్ జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో 5 నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. దరఖాస్తులు సమర్పించేందుకు 18న చివరి తేదీ సాయంత్రం 5 గంటల లోపు కొత్తగడిలోని బాలికల పాఠశాలలో ఇవ్వాలన్నారు. దరఖాస్తులతో పాటు కులం, ఆదాయం, హాల్ టికెట్, ర్యాంక్ కార్డు సమర్పించాలన్నారు.

News October 17, 2025

KMR: 49 షాపులకు 419 దరఖాస్తులు

image

మద్యం దుకాణాల దరఖాస్తుల ప్రక్రియకు కామారెడ్డి జిల్లాలో భారీ స్పందన లభిస్తోంది. గురువారం వరకు జిల్లాలోని మొత్తం 49 వైన్ షాపులకు 419 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంత రావు పేర్కొన్నారు.
కామారెడ్డి: 15 షాపులకు 104 దరఖాస్తులు
బాన్సువాడ: 9 షాపులకు 84 దరఖాస్తులు
బిచ్కుంద: 10 షాపులకు 79 దరఖాస్తులు
దోమకొండ: 8 షాపులకు 77 దరఖాస్తులు
ఎల్లారెడ్డి: 7 షాపులకు 75 దరఖాస్తులు వచ్చాయన్నారు.