News October 16, 2025
భద్రాద్రి: పోరుకు పుంజులు సన్నద్ధం..!

అశ్వారావుపేట మండలం పండువారిగూడెంకు చెందిన ఓ రైతు సంక్రాంతి కోసం తన పొలంలో వందలాది కోడి పందెం పుంజులను పెంచుతున్నాడు. గ్రీన్ హీట్ కంచెలు, ఇనుప గంపలు, తాటి ఆకులతో ఏర్పాటు చేసిన రక్షణ గోడలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పండుగ దగ్గర పడుతుండటంతో పుంజులను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు, కొనుగోలుదారులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.
Similar News
News October 17, 2025
మామునూరు ఎయిర్‌పోర్టును నిధులు.. సీఎంను కలిసిన ఎంపీ

మమునూరు ఎయిర్ పోర్టుకు అదనంగా నిధులు కేటాయించడంపై సీఎం రేవంత్ రెడ్డిని ఎంపీ కడియం కావ్య కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎయిర్పోర్ట్ విస్తరణ, టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణం, రన్వే పొడిగింపు, లైటింగ్, సెక్యూరిటీ ఫెన్సింగ్ వంటి కీలక పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.90 కోట్ల నిధులను కేటాయించారు. WGL ప్రజల దీర్ఘకాల స్వప్నమైన మామునూరు విమానాశ్రయం త్వరలోనే పూర్తి స్థాయిలో ప్రారంభించబోతోందని ఎంపీ స్పష్టం చేశారు.
News October 17, 2025
‘ధాన్యం కొనుగోలుకు అధికారులు సన్నద్ధత కావాలి’

పార్వతీపురం జిల్లాలో 2025-26 ఖరీఫ్ సీజనులో ధాన్యం కొనుగోలుకు ఇప్పటినుంచే సన్నద్ధత కావాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోళ్ల సంసిద్ధతపై గురువారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజనులో రైతుల నుంచి 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ అంచనాగా నిర్ణయించామన్నారు.
News October 17, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 17, శుక్రవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.57 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.10 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.16 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.53 గంటలకు
✒ ఇష: రాత్రి 7.06 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.