News October 16, 2025

అనకాపల్లిలో ఎవరికి వారే యమునా తీరే!

image

అనకాపల్లిలో ముగ్గురు కీలక నాయకులు ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తున్నారనే చర్చ సాగుతోంది. జనసేన MLA కొణతాల పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలు చురుకుగా చేపడుతూ ముందుకెళ్తున్నారు. ఇటు TDP ఇంఛార్జ్ పీలా గోవింద్ సైతం తన వర్గంతో యాక్టివ్‌గా ఉన్నారని ప్రచారం. మరోవైపు TDPలో దాడి వీరభధ్రరావు ఒక వర్గాన్ని నడిపిస్తున్నట్లు టాక్. ఒకే సామాజిక వర్గానికి చెందిన వీరంతా తలో దారిలో సాగుతుండటంతో క్యాడర్ అయోమయంలో ఉంది.

Similar News

News October 17, 2025

తొండంగి: వేధింపులు తాళలేక వివాహిత మృతి

image

భర్త, అత్త వేధింపులు తాళలేక వివాహిత శిరీష (23) ఆత్మహత్య చేసుకున్న ఘటన తొండంగి (M) గోపాలపట్నంలో జరిగింది. పాతపట్నం మండలం తిడ్డిమికి చెందిన శిరీషకు ఈ ఏడాది మేలో ప్రదీప్‌తో వివాహమైంది. వారు గోపాలపట్నం వచ్చి జీవిస్తున్నారు. అనుమానంతో భర్త, అత్త వేధిస్తున్నారంటూ శిరీష బుధవారం తండ్రికి ఫోన్ చేసి చెప్పారు. అదే రోజు శీరిష ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తొండంగి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News October 17, 2025

కోహ్లీ వరల్డ్ రికార్డు సృష్టిస్తాడా?

image

స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 7 నెలల తర్వాత ఈనెల 19న AUSతో తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడనున్నారు. ఈ సిరీస్‌లో తను వరల్డ్ రికార్డు నెలకొల్పే అవకాశముంది. 3 మ్యాచ్‌ల్లో ఒక్క సెంచరీ చేసినా 148 ఏళ్ల క్రికెట్ చరిత్రలో సింగిల్ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా నిలుస్తారు. సచిన్ టెస్టుల్లో 51 సెంచరీలు చేయగా విరాట్ వన్డేల్లో 51 శతకాలు బాదారు. మరో సెంచరీ చేస్తే సచిన్‌ రికార్డును అతడు అధిగమిస్తారు.

News October 17, 2025

రామగుండం: సింగరేణి ఉద్యోగులకు 20న సెలవు

image

సింగరేణి ఉద్యోగులకు ఈనెల 20న దీపావళి పండుగ సందర్భంగా వేతనంతో కూడిన సెలవు దినం ప్రకటించారు. ఈ మేరకు యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అత్యవసర విధులు నిర్వహించే ఉద్యోగులకు సెలవు రోజున సాధారణ వేతనంతో పాటు మూడింతలు అధికంగా వేతనం చెల్లించనున్నట్లు అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.