News October 16, 2025

జగిత్యాల: ‘చెల్లని జీవోల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు’

image

చెల్లని జీవోల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు ఆడుతుందని జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు విద్యాసాగర్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో సవరణ లేకుండా, చట్టబద్ధత లేకుండా 42% రిజర్వేషన్ ఇస్తామని బీసీలను మభ్యపెట్టారని పేర్కొన్నారు. ఈనెల 18న చేపట్టిన బంద్‌కు మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఎల్ రమణ, దావ వసంత తదితరులు పాల్గొన్నారు.

Similar News

News October 17, 2025

DRDOలో 105 ఉద్యోగాలు

image

బెంగళూరులోని DRDO ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్(LRDE)లో 105 అప్రెంటీస్ ఖాళీలకు నోటిఫికేషన్ వెలువడింది. పోస్టును బట్టి సంబంధిత విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ పాసైన వారు అర్హులు. NOV 4న బెంగళూరులో ఇంటర్వ్యూ ఉంటుంది. ఎంపికైన వారు ఏడాది పాటు పనిచేయాలి.
వెబ్‌సైట్: https://www.drdo.gov.in/
* మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News October 17, 2025

ఖమ్మం జిల్లాలో రేపు విద్యాసంస్థలు బంద్

image

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రేపు విద్యాసంస్థల బంద్ ఉంటుందని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు మస్తాన్, సుధాకర్, సురేష్ తెలిపారు. బీసీల 42 శాతం రిజర్వేషన్ బిల్లును ఆమోదించకపోవడాన్ని నిరసిస్తూ రేపటి బంద్‌కు మద్దతు ప్రకటిస్తున్నట్లు శుక్రవారం నిర్వహించిన సమావేశంలో చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కులను కాల రాస్తుందని వారు పేర్కొన్నారు.

News October 17, 2025

MNCL: జిల్లాలో 1,57,642 ఎకరాల్లో వరి సాగు

image

జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార దీపక్ అన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, అధికారులతో కలిసి వరి ధాన్యం కొనుగోలుపై సన్నాక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో ఒక లక్ష 57వేల 642 ఎకరాలలో వరి సాగు జరుగుతుందని, 3లక్షల 58వేల 970 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా వేయడం జరిగిందన్నారు.