News October 16, 2025
వంట చేయకపోతేనే హ్యాపీగా ఉంటారట!.. హార్వర్డ్ స్టడీ

తమ భర్తల కోసం వంట చేసేవారితో పోల్చితే చేయని స్త్రీల వైవాహిక జీవితమే సంతోషంగా ఉన్నట్లు హార్వర్డ్ అధ్యయనం తెలిపింది. ‘మహిళ నిత్యం వంట చేయడం వల్ల ఆమె తెలియకుండానే సేవకురాలిగా మారిపోతుంది. దీనివల్ల భాగస్వామ్య భావన తగ్గి, వైవాహిక సంతృప్తి కూడా తగ్గుతుంది’అని అధ్యయనం పేర్కొంది. 15 ఏళ్లపాటు 12వేల విదేశీ జంటలపై సర్వే చేయగా వంట చేసేవారు వైవాహిక జీవితంపై 6.1/10 ఇస్తే చేయనివారు 8.4/10 మార్కులిచ్చారు.
Similar News
News October 17, 2025
విడిపోయినా కలవొచ్చు..

హిందూ వివాహ చట్టం-1955, సెక్షన్-9 ద్వారా విడిపోయిన భార్యాభర్తలు తిరిగి వివాహ బంధాన్ని పునరుద్ధరింపజేయమని కోరవచ్చు. సెక్షన్-10 ప్రకారం బంధం చెడకుండా విడివిడిగా ఉండటానికి న్యాయస్థానం ద్వారా అనుమతి కోరవచ్చు. న్యాయసేవల అధికారిక చట్టం ద్వారా స్త్రీలు, పిల్లలు ఉచిత న్యాయసేవలను పొందొచ్చు. ఎవరైనా మహిళను విచారణ జరిపేటప్పుడు ఆమె నివాసంలో, కుటుంబ సభ్యుల సమక్షంలో జరపాలి.
News October 17, 2025
‘దేవుడివి సామీ’.. మహేశ్‌బాబుపై ప్రశంసలు

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు తన ఫౌండేషన్ ద్వారా చేయిస్తోన్న ఉచిత గుండె ఆపరేషన్ల సంఖ్య తాజాగా 5వేలకు చేరింది. ఈ విషయాన్ని అభిమానులు పోస్ట్ చేస్తూ ‘దేవుడు’ అంటూ కొనియాడుతున్నారు. వైద్యం చేయించుకోలేని నిరుపేదలు ‘మహేశ్‌బాబు ఫౌండేషన్’లో <
News October 17, 2025
బంపరాఫర్.. రూ.11కే 2TB వరకు స్టోరేజ్

దీపావళికి గూగుల్ 1 స్టోరేజీకి సంబంధించి స్పెషల్ ఆఫర్స్ తీసుకొచ్చింది. ప్రస్తుతం లైట్(30GB రూ.30), బేసిక్(100GB రూ.130), స్టాండర్డ్(200GB రూ.210), ప్రీమియం(2TB రూ.650) ఉన్న ఈ ప్లాన్స్‌ను నెలకు రూ.11కే అందిస్తోంది. వీటితో జీమెయిల్, గూగుల్ ఫొటోస్, గూగుల్ డ్రైవ్‌లో ఎక్స్‌ట్రా స్టోరేజ్ పొందొచ్చు. ఈ ధరలు 3 నెలలు మాత్రమేనని, ఆఫర్ OCT 31 వరకే అందుబాటులో ఉంటుందని తెలిపింది. తర్వాత సాధారణ ధరలు వర్తిస్తాయి.