News October 16, 2025

50 ఏళ్ల వయసులో సింగర్ రెండో పెళ్లి!

image

సింగర్ రఘు దీక్షిత్ 50 ఏళ్ల వయసులో రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. సింగర్, ఫ్లూటిస్ట్ వారిజశ్రీ వేణుగోపాల్(34)ను ఈ నెలాఖరున ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. 2005లో డాన్సర్ మయూరి ఉపాధ్యాయతో ఆయనకు వివాహం జరగగా 2019లో విడాకులు తీసుకున్నారు. రఘు తెలుగులో శ్రీమంతుడు, S/O సత్యమూర్తి, జనతా గ్యారేజ్ వంటి సినిమాల్లో పాటలు పాడారు. కన్నడ, హిందీ, మలయాళ, తమిళ భాషల్లో పలు చిత్రాలకు సంగీతం అందించారు.

Similar News

News October 17, 2025

విడిపోయినా కలవొచ్చు..

image

హిందూ వివాహ చట్టం-1955, సెక్షన్‌-9 ద్వారా విడిపోయిన భార్యాభర్తలు తిరిగి వివాహ బంధాన్ని పునరుద్ధరింపజేయమని కోరవచ్చు. సెక్షన్‌-10 ప్రకారం బంధం చెడకుండా విడివిడిగా ఉండటానికి న్యాయస్థానం ద్వారా అనుమతి కోరవచ్చు. న్యాయసేవల అధికారిక చట్టం ద్వారా స్త్రీలు, పిల్లలు ఉచిత న్యాయసేవలను పొందొచ్చు. ఎవరైనా మహిళను విచారణ జరిపేటప్పుడు ఆమె నివాసంలో, కుటుంబ సభ్యుల సమక్షంలో జరపాలి.

News October 17, 2025

‘దేవుడివి సామీ’.. మహేశ్‌బాబుపై ప్రశంసలు

image

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు తన ఫౌండేషన్‌ ద్వారా చేయిస్తోన్న ఉచిత గుండె ఆపరేషన్ల సంఖ్య తాజాగా 5వేలకు చేరింది. ఈ విషయాన్ని అభిమానులు పోస్ట్ చేస్తూ ‘దేవుడు’ అంటూ కొనియాడుతున్నారు. వైద్యం చేయించుకోలేని నిరుపేదలు ‘మహేశ్‌బాబు ఫౌండేషన్‌’లో <>నమోదు<<>> చేసుకోవాలని ఆయన అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. రియల్‌ లైఫ్‌ హీరోగా మహేశ్‌బాబు అందిస్తున్న చేయూతకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

News October 17, 2025

బంపరాఫర్.. రూ.11కే 2TB వరకు స్టోరేజ్

image

దీపావళికి గూగుల్ 1 స్టోరేజీకి సంబంధించి స్పెషల్ ఆఫర్స్ తీసుకొచ్చింది. ప్రస్తుతం లైట్(30GB రూ.30), బేసిక్(100GB రూ.130), స్టాండర్డ్(200GB రూ.210), ప్రీమియం(2TB రూ.650) ఉన్న ఈ ప్లాన్స్‌ను నెలకు రూ.11కే అందిస్తోంది. వీటితో జీమెయిల్, గూగుల్ ఫొటోస్, గూగుల్ డ్రైవ్‌లో ఎక్స్‌ట్రా స్టోరేజ్ పొందొచ్చు. ఈ ధరలు 3 నెలలు మాత్రమేనని, ఆఫర్ OCT 31 వరకే అందుబాటులో ఉంటుందని తెలిపింది. తర్వాత సాధారణ ధరలు వర్తిస్తాయి.