News October 16, 2025
నంద్యాల ఎంపీని పలకరించిన మోదీ

శ్రీశైలం పర్యటనలో భాగంగా ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి నంద్యాల ఎంపీ శబరి స్వాగతం పలికారు. ఎంపీ శబరిని మోదీకి సీఎం పరిచయం చేశారు. ‘ఆమె నాకు తెలుసు. చాలాసార్లు శ్రీశైలానికి రమ్మని ఆహ్వానించారు. శబరి వల్ల శ్రీశైలానికి నేను వచ్చా. శబరి మీకు నా ఆశీస్సులు ఉంటాయి’ అని మోదీ అన్నారు.
Similar News
News October 18, 2025
వరంగల్ మార్కెట్‌కు 4 రోజుల సెలవులు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా 4 రోజుల సెలవులు రానున్నాయి. శనివారం వారంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు, సోమ, మంగళవారం దీపావళి సందర్భంగా మార్కెట్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి, రైతులు గమనించి 4 రోజులు సరుకులు తీసుకొని రావద్దని విజ్ఞప్తి చేశారు. తిరిగి బుధవారం మార్కెట్ ప్రారంభం అవుతుందన్నారు.
News October 18, 2025
అనకాపల్లి: స్త్రీ శక్తితో జిల్లాలో 116 శాతానికి పెరిగిన ఓఆర్

స్త్రీ శక్తి పథకంతో అనకాపల్లి జిల్లాలో ఓఆర్ 70 శాతం నుంచి 116 శాతానికి పెరిగిందని జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారిణి వి.ప్రవీణ శుక్రవారం తెలిపారు. ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 31.50 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించినట్లు తెలిపారు. వీరి ద్వారా ఆర్టీసీకి రూ.11.32 కోట్లు ఆదాయం ప్రభుత్వం నుంచి వస్తుందన్నారు. ఈ పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
News October 18, 2025
ఖమ్మం జిల్లా డీసీసీ పీఠమెక్కేదెవరో..?

ఖమ్మం జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి కోసం పలువురు పోటీ పడుతున్నారు. ఈ పదవి కోసం ఇప్పటికే 30 మంది దరఖాస్తు చేసుకోగా ఎవరిని ఎంపిక చేస్తారోనన్న ఉత్కంఠ నెలకొంది. ముగ్గురు మంత్రుల అనుచరులు ఎవరికి వారు తమకు అధ్యక్ష పదవి దక్కేలా చూడాలంటూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అమాత్యులు, ఇతర ముఖ్య నేతల ఏకాభిప్రాయంతో డీసీసీని ఎంపిక చేస్తారనే ప్రచారం జరుగుతోంది.