News October 16, 2025

‘ఓటుకు నోటు’ కేసు విచారణ వాయిదా

image

‘ఓటుకు నోటు‘ కేసు నిందితులు రేవంత్, సండ్ర వెంకట వీరయ్య పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు నవంబర్ 3కి వాయిదా వేసింది. రేవంత్‌పై ఏసీబీ నమోదు చేసిన కేసు చట్టవిరుద్ధమని నిన్న ఆయన తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ పేర్కొన్నారు. ఏసీబీ చట్టం ప్రకారం లంచం తీసుకోవడమే నేరమని వాదించారు. గురువారం కూడా వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. న్యాయమూర్తులు మహేశ్వరి, విజయ్ బిష్ణోయ్ కేసు విచారించారు.

Similar News

News October 17, 2025

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

కేరళలోని కొచ్చిన్ షిప్‌యార్డ్‌ లిమిటెడ్ 19 కాంట్రాక్ట్ ఔట్‌ఫిట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 29 వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్, ITI నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్‌తో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.300. SC,ST, PWBDలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. వెబ్‌సైట్: https://cochinshipyard.in/

News October 17, 2025

తిరుమల: శ్రీవారి దర్శనానికి 12గంటల సమయం!

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వదర్శనానికి 12గంటల వరకు సమయం పడుతోంది. అటు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 30 కంపార్టుమెంట్లలో భక్తులు దర్శనానికి వేచి ఉన్నారు. నిన్న స్వామిని 61,521 మంది దర్శించుకోగా.. 25,101 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.66కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.

News October 17, 2025

ఈశాన్య రుతుపవనాల ఎఫెక్ట్.. భారీ వర్షాలు

image

AP: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఇవాళ ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని వెల్లడించింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి 35-55KM వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.