News April 8, 2024

టీచర్ల విదేశీ ప్రయాణల అనుమతులు రద్దు

image

ఎన్నికల నేపథ్యంలో టీచర్ల విదేశీ ప్రయాణ అనుమతులను రద్దు చేస్తూ పాఠశాల విద్యా కమిషనర్ సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల విధుల్లో వారిని నియమించి శిక్షణ ఇస్తున్నారు. మే 13లోపు విదేశాలకు వెళ్లేందుకు పొందిన అనుమతులను రద్దు చేస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మే 13న పోలింగ్ ముగిశాక విదేశాలకు వెళ్లే అనుమతులు ఇచ్చేందుకు ఆన్‌లైన్లో సమర్పించాలని డీఈవో సుభద్ర తెలిపారు.

Similar News

News October 6, 2024

పొదిలి: ఉప సర్పంచ్‌పై రాడ్లతో దాడి

image

ఉప సర్పంచ్‌పై రాళ్ల దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన పొదిలి మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు వివరాల ప్రకారం.. పొదిలి మండలం మాదిరెడ్డిపాలెం ఉపసర్పంచ్ ఓంకార్‌ని శనివారం అర్ధరాత్రి సమయంలో, తన ఇంటికి వెళ్ళే క్రమంలో గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు కాపుకాసి రాడ్లుతో తలమీద దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాడికి గల పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

News October 5, 2024

ఒంగోలులో ఈనెల 8న మినీ జాబ్ మేళా

image

జిల్లా ఉపాధి కార్యాలయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృధి సంస్థ, సీడప్ ఒంగోలువారి ఆధ్వర్యంలో అక్టోబరు 8న, ఒంగోలు ప్రభుత్వ బాలికల ITI కాలేజీలో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నారు.ITI, డిడిప్లొమా, టెన్త్, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ పూర్తి చేసి 18 సం. నుంచి 30సం. లోపు మధ్య వయసు గల అభ్యర్థులు అర్హులని జిల్లా అధికారులు రవితేజ, భరద్వాజ్‌లు తెలియజేశారు.

News October 5, 2024

ఒంగోలు ట్రిపుల్ ఐటీకి 6 నుంచి దసరా సెలవులు

image

రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధిలో ఉన్న ఒంగోలు, నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు ఈనెల 6 నుంచి 13 వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు, ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య అమరేంద్ర కుమార్ శనివారం తెలిపారు. తిరిగి క్లాసులు ఈనెల 14 నుంచి పునః ప్రారంభమవుతాయని చెప్పారు.