News October 16, 2025
విశాఖలో ₹1,222 కోట్లతో లులు ప్రాజెక్టు

AP: విశాఖకు AI హబ్, డిజిటల్ డేటా సెంటర్ రానుండడంతో ‘లులు’ తన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఏర్పాటుకు రెడీ అవుతోంది. రూ.1,222 కోట్లతో హార్బర్ పార్కు వద్ద 13.74 ఎకరాల్లో వచ్చే ఈ ప్రాజెక్టులో హైపర్ మార్కెట్, ఫ్యాషన్ స్టోర్, లులు కనెక్ట్, ఫన్ టూర్ వంటివి ఉంటాయి. దీనికి ప్రభుత్వం పలు రాయితీలిస్తోంది. ఇటీవల క్యాబినెట్లో మంత్రి నాదెండ్ల మనోహర్ అభ్యంతరం తెలిపినా ప్రభుత్వం సవరించిన నిబంధనలకు ఓకే చెప్పింది.
Similar News
News October 17, 2025
భారీగా పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు!

ధన త్రయోదశికి ముందు బంగారం ధరలు భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. ఇవాళ HYD బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.3,330 పెరిగి ₹1,32,770కు చేరింది. ఏడు రోజుల్లో రూ.9,060 పెరగడం గమనార్హం. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 3,050 ఎగబాకి ₹1,21,700గా ఉంది. అటు వెండి ధర మాత్రం రూ.3,000 తగ్గింది. కేజీ సిల్వర్ రేటు రూ.2,03,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News October 17, 2025
భారత్‌తో సిరీస్.. ఆసీస్ కీలక ప్లేయర్ ఔట్

భారత్‌తో వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ కండరాల నొప్పితో సిరీస్‌కు దూరమయ్యారు. అతని స్థానంలో మార్నస్ లబుషేన్‌ను ఎంపిక చేశారు. ఈ నెల 19న తొలి వన్డే పెర్త్‌లో, 23న రెండోది అడిలైడ్, మూడో వన్డే 25న సిడ్నీలో జరగనుంది. మొదటి మ్యాచ్ పెర్త్‌లో జరగనుండగా, అక్కడి బౌన్సీ పిచ్ మన బ్యాటర్లకు సవాలు విసరనుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.
News October 17, 2025
అన్నింటా రాణిస్తున్న అతివలు

ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ ఆడవాళ్లు తమ ముద్ర వేస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో తామూ ముందుంటామంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో 77వ రెగ్యులర్ రిక్రూట్ బ్యాచ్‌లో 174 మంది ఈసారి ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకున్నారు. వారిలో 62 మంది అమ్మాయిలే. ఇండియన్ పోలీస్ సర్వీస్ చరిత్రలో ఇది ఒక రికార్డుగా చెప్పవచ్చు. 73వ బ్యాచ్‌లో 20.66% ఉన్న ఈ సంఖ్య, ఈసారి 35% పైగా పెరగడం గమనార్హం.