News April 8, 2024

HYD: ఆ ప్రాజెక్ట్‌తో నెలకు రూ.16 లక్షల ఆదాయం!

image

HYD శివారు ORRకు సమాంతరంగా గత BRS ప్రభుత్వం నిర్మించిన సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ ప్రాజెక్టు ద్వారా రోజుకు 13 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతుందని HMDA అధికారులు వెల్లడించారు. నెలకు దాదాపు రూ.16 లక్షల వరకు ఆదాయం లభిస్తుందని తెలిపారు. ఈ విద్యుత్‌ను రహదారులపై లైటింగ్ సహా, ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నట్లుగా తెలియజేశారు.

Similar News

News September 11, 2025

HYD: ‘రోడ్డు ప్రమాదాల్లో తెలంగాణది 8వ స్థానం’

image

రోడ్డు ప్రమాదాల్లో జాతీయ స్థాయిలో తెలంగాణ 8వ స్థానంలో, మరణాల్లో 10వ స్థానంలో ఉందని సీఎస్ రామకృష్ణారావు అన్నారు. బుధవారం సుప్రీంకోర్టు కమిటీ ఛైర్మన్ అభయ్ మనోహర్ సప్రే, తెలంగాణ అధికారులతో రోడ్డు భద్రతపై సమావేశం నిర్వహించారు. హెల్మెట్లు, సీట్ బెల్టులు ధరించకపోవడం, మద్యం తాగి వాహనాలు నడపడం, మొబైల్ ఫోన్ వాడకం, అతివేగం వంటి ప్రధాన కారణాలుగా గుర్తించామన్నారు. అవగాహన కార్యక్రమాలు పెంచాలన్నారు.

News September 11, 2025

HYD: మియాపూర్‌లో CMR షాపింగ్ మాల్ ప్రారంభం

image

HYD మియాపూర్ డివిజన్ పరిధిలో బుధవారం సినీ నటి మృణాల్ ఠాకూర్ సందడి చేశారు. CMR షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌తో సెల్ఫీ దిగేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. మృణాల్ ఠాకూర్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు రావడంతో స్థానికంగా సందడి నెలకొంది.

News September 11, 2025

HYD: ముమ్మరంగా వరద సహాయక చర్యలు: మంత్రి

image

భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో చేపట్టిన సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు బుధవారం సహాయక చర్యలపై HYDలో సెక్రటేరియట్‌లో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల వల్ల చాలా వరకు ప్రాణ, ఆస్తి నష్టం తగ్గిందన్నారు. ఇప్పటి వరకు పరిహారం విడుదల చేయకపోతే వాటిని వెంటనే విడుదల చేయాలన్నారు.