News October 16, 2025

సంగారెడ్డి: ఎస్పీని కలిసిన బీసీ జేఏసీ నాయకులు

image

సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ పారితోష్ పంకజ్‌ను బీసీ జేఏసీ నాయకులు గురువారం కలిశారు. 42 శాతం రిజర్వేషన్ల కోసం ఈనెల 18న జరిగే బంద్‌కు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా ఛైర్మన్ ప్రభు గౌడ్, గోకుల్ కృష్ణ, మల్లికార్జున్ పటేల్, వెంకట హరి హర కిషన్, మంగ గౌడ్, వీరమని, నాయకులు పాల్గొన్నారు.

Similar News

News October 18, 2025

ఈనెల 27 నుంచి ధాన్యం కొనుగోళ్లు

image

AP: రాష్ట్రంలో ఈ నెల 27 నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘3,013 రైతు సేవా కేంద్రాలు, 2,061 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, 10,700 మంది సిబ్బందితో సన్నాహాలు చేస్తున్నాం. 51 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు మిల్లర్లు పనిచేయాలి. ధాన్యం 24 గంటల నుంచి 48 గంటల్లోగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తాం’ అని తెలిపారు.

News October 18, 2025

నేడు మద్యం, మాంసం వద్దు! ఎందుకంటే..?

image

ధన త్రయోదశి పర్వ దినాన మాంసం, మద్యం వంటి తామసిక ఆహారాన్ని తీసుకోకూడదని పండితులు సూచిస్తున్నారు. లేకపోతే లక్ష్మీ కటాక్షం కలగదని అంటున్నారు. ‘నలుపు రంగు వస్తువులు కొనుగోలు చేయకూడదు. గృహోపకరణాలు దానం చేయడం, అమ్మడం వంటివి చేయకండి. నేడు ఎవరికీ రుణం ఇవ్వకూడదు. ఇంట్లో ఏ మూలనా చీకటి లేకుండా, ప్రతి చోట పరిశుభ్రత, దీపాల వెలుగు ఉండేలా చూసుకోవాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది’ అని సూచిస్తున్నారు.

News October 18, 2025

మంచిర్యాల: ఎక్సైజ్ టెండర్లకు భారీ స్పందన

image

మంచిర్యాల జిల్లాలో ఎక్సైజ్ టెండర్లకు భారీ స్పందన కనిపించింది. జిల్లాలోని ఏర్పాటుచేసిన పలు కేంద్రాల వద్ద శుక్రవారం 433 దరఖాస్తులు వచ్చినట్లుగా జిల్లా అధికారులు తెలిపారు. ఇప్పటివరకు మంచిర్యాలలో 263, బెల్లంపల్లి 185, లక్షెట్టిపేట 109, చెన్నూరు 98, మొత్తంగా 655 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు.