News October 17, 2025

NRPT: ‘పెండింగ్ ఉన్న ఓటరు దరఖాస్తులు పరిష్కరించాలి’

image

పెండింగ్‌లో ఉన్న ఓటరు దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు. BLOలకు గుర్తింపు కార్డులు అందించాలని, ఓటరు గుర్తింపు కార్డులను అందించాలని చెప్పారు. ప్రతి బూత్‌కు అధికారిని నియమించాలని సూచించారు.

Similar News

News October 17, 2025

సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీలో అలా లేదు: ఈసీ

image

TG: స్థానిక ఎన్నికలపై హైకోర్టులో కీలక వాదనలు జరిగాయి. ‘ఎన్నికలకు వెళ్లాలని SC కూడా చెప్పింది కదా?’ అని ECని HC ప్రశ్నించింది. అయితే విచారణ సందర్భంగా అలా వ్యాఖ్యానించింది కానీ ఫైనల్ ఆర్డర్ కాపీలో ఎన్నికలకు వెళ్లాలనే ఆదేశాలు లేవని EC పేర్కొంది. రిజర్వేషన్ల అంశం కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున అది తేలేవరకు ఎలక్షన్స్ నిర్వహించలేమంది. ప్రభుత్వంతో చర్చించాకే రీనోటిఫికేషన్ ఇస్తామని HCకి వివరించింది.

News October 17, 2025

ఇలా అయితే.. సిటీ మూసీలోకే: రఘునందన్‌రావు

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో విజయం సాధించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను మభ్యపెడుతున్నాయని పేర్కొన్నారు. కన్నీళ్లతో ఒకరు ప్రచారానికి వస్తే.. కట్టెలు తీసుకొని ఇంకొకరు వస్తున్నారన్నారు. అయితే ఈ ఇద్దరిలో ఎవరు వచ్చినా సిటీ మూసీలో కలవాల్సిన పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. 

News October 17, 2025

జూరాల ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 38,000 క్యూసెక్కులు

image

ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గింది. శుక్రవారం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 38,000 క్యూసెక్కులు వస్తోంది. ప్రాజెక్టు అన్ని గేట్లు మూసివేశారు. విద్యుత్ ఉత్పత్తికి 34,592 క్యూసెక్కులు, నెట్టెంపాడు లిఫ్ట్ కు 750, భీమా లిఫ్ట్-1 కు 650, లిఫ్ట్ -2 కు 750, ఎడమ కాల్వకు1,030, కుడి కాలువకు 680 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మొత్తం ప్రాజెక్టు నుంచి 37,773 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.