News October 17, 2025

సిద్దిపేట: ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయండి: కలెక్టర్

image

ఖరీఫ్ 2025-26 సీజన్ వరిధాన్యం సులభంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియ జరిగేలా మిల్లర్లు, అధికారులు పనిచేయాలని కలెక్టర్ కె.హైమావతి ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రతినిధులు, జిల్లా సివిల్ సప్లై, డీఆర్డీఓ అధికారులులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

Similar News

News October 17, 2025

ములుగు: ఆశన్న కుటుంబ నేపథ్యం ఇదే..!

image

మావోయిస్టు, కేంద్ర కమిటీ సభ్యుడు తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న, అలియాస్ రూపేశ్ శుక్రవారం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ముందు లొంగిపోయారు. ఆశన్న ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామ వాసి. తండ్రి భిక్షపతి రావు, తల్లి సరోజన. కాగా, అనారోగ్య కారణాలవల్ల కొద్ది సంవత్సరాల క్రితం తండ్రి మరణించగా.. తల్లి ఆశన్న సోదరుడైన సహదేవరావు వద్ద ఉంటున్నట్లు స్థానికులు తెలిపారు.

News October 17, 2025

‘హాక్ ఏపీ హ్యాకథాన్’కు రిజిస్ట్రేషన్ చేసుకోండి: ఎస్ఈ

image

విద్యుత్ రంగంలో సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ‘హాక్ ఏపీ హ్యాకథాన్’ నిర్వహించనున్నట్లు ఏలూరు జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ సాల్మన్ రాజు తెలిపారు. ఈ కార్యక్రమం విశాఖపట్నంలో జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. సాంకేతిక పరిష్కారాలను అందించగలిగే స్టార్టప్ సంస్థలు ఈ హ్యాకథాన్‌లో పాల్గొనాలని కోరారు. మరింత సమాచారం, రిజిస్ట్రేషన్ కోసం https://electronvibe.com/hackap-hackathon/ను పరిశీలించాలని సూచించారు.

News October 17, 2025

జనసేన వినూత్న కార్యక్రమం: పవన్ కళ్యాణ్

image

AP: రాజకీయ వ్యవస్థలో నవతరం యువతను భాగస్వామ్యం చేసేందుకు “సేనతో సేనాని – మన నేల కోసం కలిసి నడుద్దాం” అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీని ద్వారా ఔత్సాహిక యువతీ, యువకులు తమకు నచ్చిన అంశాన్ని ఎంచుకుని సేవలు అందించే అవకాశాన్ని ఈ వేదిక కల్పించనుందని చెప్పారు. పూర్తి వివరాలకు జనసేన పార్టీ <>సైట్<<>> చూడాలని ట్వీట్ చేశారు.