News October 17, 2025

VKB: ఖాళీగా ఉన్న సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం

image

వికారాబాద్ జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో 5 నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. దరఖాస్తులు సమర్పించేందుకు 18న చివరి తేదీ సాయంత్రం 5 గంటల లోపు కొత్తగడిలోని బాలికల పాఠశాలలో ఇవ్వాలన్నారు. దరఖాస్తులతో పాటు కులం, ఆదాయం, హాల్ టికెట్, ర్యాంక్ కార్డు సమర్పించాలన్నారు.

Similar News

News October 18, 2025

నేడు ఈ వ్రతం చేస్తే బాధల నుంచి విముక్తి

image

శ్రీ లక్ష్మీ కుబేర వ్రతాన్ని నేడు ఆచరిస్తే అపారమైన ఐశ్వర్యం, ఆర్థిక స్థిరత్వం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారు, ఉద్యోగాభివృద్ధి కోరేవారు ఈ వ్రతం చేస్తే ఇంట్లో ధన ప్రవాహం పెరిగి, దారిద్య్రం తొలగి, అన్నింటా విజయం లభిస్తుందంటున్నారు. ధనాదిదేవత లక్ష్మీదేవి, ధనాధ్యక్షుడు కుబేరుని ఆశీస్సులతో శుభం కలుగుతుందంటున్నారు.

News October 18, 2025

అత్యాచారం కేసులో 10 ఏళ్ల శిక్ష

image

66 ఏళ్ల వృద్ధురాలిపై 2018లో జరిగిన అత్యాచారం కేసులో అనంతపురం జిల్లా మదిగుబ్బకు చెందిన 55ఏళ్ల పెద్దన్నకు అనంతపురం నాలుగో సెషన్స్ కోర్టు 10 ఏళ్ల జైలు, రూ.5 వేల జరిమానా విధించింది. కేసు విచారణలో 11 మంది సాక్షుల వాదనలు పరిశీలించిన అనంతరం నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి హరిత తీర్పు వెలువరించారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన పోలీసులను అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ అభినందించారు.

News October 18, 2025

NZB: కానిస్టేబుల్ హత్య.. నిందితుడిపై 60కి పైగా కేసులు

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. హతుడు రియాజ్ పై 60కి పైగా కేసులు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. చైన్ స్నాచింగ్, దొంగతనాలు, గొడవలు, చోరీ కేసులు ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం నిందితుడు రియాజ్ పరారీలో ఉండగా పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కానిస్టేబుల్ మృతి పట్ల పోలీస్ అధికారులు సంతాపం తెలిపారు.