News October 17, 2025
ChatGptలో అడల్ట్ కంటెంట్!

త్వరలో ChatGptలో ఎరోటిక్(అడల్ట్) కంటెంట్ జెనరేషన్ అందుబాటులోకి వస్తుందని OpenAI CEO శామ్ ఆల్ట్‌మన్ ప్రకటించారు. 18+ యూజర్లు కథలు, యానిమీలు, వీడియోల వంటివి తమకు నచ్చిన రూపంలో ఎరోటిక్ కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చని తెలిపారు. అయితే ఇది సెలక్టివ్ యూజర్లకే అందుబాటులో ఉంటుందని చెప్పారు. దీనిపై సర్వత్రా వ్యతిరేకత రాగా.. ‘అడల్ట్ యూజర్స్‌ని అడల్ట్స్‌లాగే ట్రీట్ చేయాలి’ అని శామ్ సమర్థించుకోవడం గమనార్హం.
Similar News
News October 18, 2025
మినుములో మారుకా పురుగు.. వేపనూనెతో చెక్

మినుము మొగ్గ, పిందె దశలలో మారుకా మచ్చల పురుగు ఆశించి నష్టం కలిగిస్తుంది. ఒక తల్లి పురుగు 200-500 గుడ్లను పెడుతుంది. వాటి లార్వాలు బయటకు వచ్చి మొగ్గలు, పిందెలను తినేస్తాయి. దీంతో దిగుబడి తగ్గిపోతుంది. ఈ పురుగు నివారణకు 5మి.లీ వేప నూనె లేదా నొవల్యూరాన్ 1.0మి.లీ లేదా క్లోరిపైరిఫాన్ 2.5 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. 5-10 రోజుల వ్యవధిలో ఈ మందులను మార్చి పిచికారీ చేయాలి.
News October 18, 2025
చీర కట్టినప్పుడు పొడవుగా కనిపించాలంటే..

కాస్త ఎత్తు తక్కువగా ఉండి, లావుగా ఉన్నవారు కొన్ని టిప్స్ పాటిస్తే చీర కట్టుకున్నప్పుడు పొడవుగా, అందంగా కనిపిస్తారంటున్నారు ఫ్యాషన్ నిపుణులు. మృదువైన సిల్కు ప్లెయిన్ చీరకు చిన్న అంచు ఉన్నవి ఎంచుకోవాలి. దీనిపై మీడియం ప్రింట్స్ ఉన్న బ్లౌజ్ వెయ్యాలి. డీప్‌నెక్ బ్లౌజ్ వేసుకోవాలి. పెద్ద బోర్డర్లున్న చీరలు, పెద్ద ప్రింట్స్ ఉన్నవి ఎంచుకోకూడదు. నెక్ విషయానికొస్తే హైనెక్, క్లోజ్ నెక్‌కు దూరంగా ఉండాలి.
News October 18, 2025
రాష్ట్రంలో 34 ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<