News October 17, 2025
టైర్ పేలి దగ్ధమైన బస్సు.. 29 మంది క్షేమం

అనంతపురం (D) గార్లదిన్నె మం. తలగాచిపల్లి క్రాస్ వద్ద 44వ జాతీయ రహదారిపై అర్ధరాత్రి పెను ప్రమాదం తప్పింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బెంగళూరు నుంచి రాయచూర్‌లోని దేవదుర్గకు వెళ్తుండగా మార్గమధ్యలో బస్సు టైర్ పగిలింది. మంటలు ఎగిసి పడటంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఆ సమయంలో బస్సులో ఉన్న 29 మంది ప్రయాణికులు అప్రమత్తమై సురక్షితంగా బయటపడ్డారు. ఎస్సై మహమ్మద్ గౌస్ ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
Similar News
News October 18, 2025
నేడు మద్యం, మాంసం వద్దు! ఎందుకంటే..?

ధన త్రయోదశి పర్వ దినాన మాంసం, మద్యం వంటి తామసిక ఆహారాన్ని తీసుకోకూడదని పండితులు సూచిస్తున్నారు. లేకపోతే లక్ష్మీ కటాక్షం కలగదని అంటున్నారు. ‘నలుపు రంగు వస్తువులు కొనుగోలు చేయకూడదు. గృహోపకరణాలు దానం చేయడం, అమ్మడం వంటివి చేయకండి. నేడు ఎవరికీ రుణం ఇవ్వకూడదు. ఇంట్లో ఏ మూలనా చీకటి లేకుండా, ప్రతి చోట పరిశుభ్రత, దీపాల వెలుగు ఉండేలా చూసుకోవాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది’ అని సూచిస్తున్నారు.
News October 18, 2025
మంచిర్యాల: ఎక్సైజ్ టెండర్లకు భారీ స్పందన

మంచిర్యాల జిల్లాలో ఎక్సైజ్ టెండర్లకు భారీ స్పందన కనిపించింది. జిల్లాలోని ఏర్పాటుచేసిన పలు కేంద్రాల వద్ద శుక్రవారం 433 దరఖాస్తులు వచ్చినట్లుగా జిల్లా అధికారులు తెలిపారు. ఇప్పటివరకు మంచిర్యాలలో 263, బెల్లంపల్లి 185, లక్షెట్టిపేట 109, చెన్నూరు 98, మొత్తంగా 655 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు.
News October 18, 2025
సమ్మె విరమించిన విద్యుత్ ఉద్యోగ సంఘాలు

AP: విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై జేఏసీ నాయకులతో 12 గంటలు సుధీర్ఘంగా జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ప్రధాన డిమాండ్లకు యాజమాన్యాలు ఒప్పుకోవడంతో సమ్మె విరమిస్తున్నట్లు JAC నాయకులు ప్రకటించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేసేందుకు, వారికి నేరుగా ప్రభుత్వం జీతాలు చెల్లించేందుకు అంగీకరించింది. 1999-2004 మధ్య ఎంపికైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానంపై కమిటీకి కూడా అంగీకారం లభించింది.