News October 17, 2025
APPLY NOW: పవర్‌గ్రిడ్‌లో ఉద్యోగాలు..

పవర్‌గ్రిడ్‌లో 20 ఆఫీసర్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. CA/ICWA ఉత్తీర్ణులైన అభ్యర్థులు నవంబర్ 5వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష(CBT),ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.powergrid.in/
Similar News
News February 3, 2026
98.42% రూ.2వేల నోట్లు వెనక్కి వచ్చాయి: RBI

రూ.2 వేల నోట్ల ఉపసంహరణపై RBI కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు 98.42 శాతం నోట్లు తిరిగి బ్యాంకులకు చేరాయని తెలిపింది. రూ.2 వేల నోట్లను ఉపసంహరిస్తున్నట్లు RBI 2023 మే-19న ప్రకటించింది. అప్పుడు ప్రజల వద్ద రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లుండగా.. ఈ జనవరి 31 నాటికి అవి రూ.5,609 కోట్లకు చేరుకున్నాయి. ప్రజల వద్ద రూ.2 వేల నోట్లుంటే RBI కార్యాలయాల్లో డిపాజిట్ లేదా మార్చుకోవచ్చని సూచించింది.
News February 3, 2026
టాటా స్టీల్ మాస్టర్స్ విజేత నొదిర్‌బెక్

ఉజ్బెకిస్థాన్ గ్రాండ్ మాస్టర్ నొదిర్‌బెక్ అబ్దుసతారోవ్ ప్రతిష్ఠాత్మక ‘టాటా స్టీల్ మాస్టర్స్’ చెస్ టైటిల్‌ను గెలుచుకున్నారు. నెదర్లాండ్స్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో తెలంగాణ ప్లేయర్ అర్జున్ ఇరిగేశీని 13వ రౌండ్‌లో ఓడించి.. 9 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ఈ మెగా టోర్నీని సొంతం చేసుకున్నారు. భారత గ్రాండ్ మాస్టర్ గుకేశ్ 6.5 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచారు.
News February 3, 2026
ధనుష్, సాయి పల్లవి జోడీగా మరో సినిమా

‘మారి 2’ సినిమాతో మెరిసిన ధనుష్, సాయి పల్లవి జోడీ మరోసారి వెండితెరపై సందడి చేయనున్నారు. అమరన్ మూవీతో సత్తాచాటిన రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో ఈ జంట నటించనుంది. హీరో ధనుష్‌కు ఇది 55వ చిత్రం. ఈ సినిమాలో ఇప్పటికే హీరోయిన్‌గా శ్రీలీల ఎంపిక కాగా.. మరో కథానాయికగా సాయి పల్లవిని సెలక్ట్ చేశారు. వాస్తవ సంఘటనల ఆధారంగా, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు సమాచారం.


