News October 17, 2025
జనగణన.. వచ్చేనెల ఇళ్ల లెక్కింపు

దేశంలో జనగణన కసరత్తు మొదలైంది. NOV 10-30 మధ్య అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎంపిక చేసిన ఏరియాల్లో హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సస్ చేపట్టనున్నారు. 2027లో జనగణన తొలిదశ జరగనుంది. దేశాభివృద్ధి, ప్రజల పరిస్థితులు తెలుసుకునేందుకు దీన్ని నిర్వహిస్తారు. ఈ గణాంకాల ఆధారంగానే ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాలు రూపొందిస్తారు. దేశంలో 1872 నుంచి జనగణన చేస్తుండగా చివరిసారి 2011లో జరిగింది.
Similar News
News October 18, 2025
నేడు గ్రూప్-2 నియామక పత్రాల పంపిణీ

TG: గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో 783 మంది అభ్యర్థులు నియామక పత్రాలు అందుకోనున్నారు. విభాగాల వారీగా ఖాళీగా ఉన్న పోస్టుల్లో వీరిని నియమించేలా ఏర్పాట్లు చేశారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
News October 18, 2025
K-Ramp పబ్లిక్ టాక్

కిరణ్ అబ్బవరం-డెబ్యూ డైరెక్టర్ జైన్స్ నాని కాంబోలో తెరకెక్కిన K-Ramp చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే USలో ప్రీమియర్స్ పడ్డాయి. కిరణ్ అబ్బవరం యాక్టింగ్, వన్ లైనర్ పంచ్‌లు అలరించాయని NRI ప్రేక్షకులు చెబుతున్నారు. అయితే ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌లా లేదని, డబుల్ మీనింగ్ డోస్ కాస్త తగ్గించి ఉంటే బాగుండేది అంటున్నారు. కాసేపట్లో Way2News రివ్యూ.
News October 18, 2025
ఆభరణాలు పెట్టుకుంటే అలర్జీ వస్తోందా?

నగలు పెట్టుకున్నపుడు కొందరికి అలర్జీ వస్తుంటుంది. దీన్ని కాంటాక్ట్ డెర్మటైటిస్ అంటారు. ఆర్టిఫిషియల్ ఆభరణాల్లో ఎక్కువగా వాడే నికెల్ అనే లోహం వల్ల చర్మంపై ఎర్రటి దద్దుర్లు, దురద, మంట, పొక్కులు వస్తుంటాయి. వీటిని వేసుకొనేముందు పౌడర్/ మాయిశ్చరైజర్/ క్యాలమైన్ లోషన్స్ రాసుకుంటే మంచిది. లేదంటే స్టెయిన్‌లెస్ స్టీల్, టైటానియం, 18 క్యారెట్ ఎల్లో గోల్డ్, స్టెర్లిన్ సిల్వర్‌లను ఎంచుకోవచ్చు.