News October 17, 2025
NLG: రైతులకు.. పత్తి వ్యాపారులే దిక్కు!

నల్గొండ జిల్లాలో పత్తి దిగుబడులు ప్రారంభమైనా.. కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. దీంతో రైతులు చేతికొచ్చిన పంటను నిల్వ చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. దిగుబడులు ప్రారంభమై 10 రోజులు దాటినా కొనుగోళ్లు లేకపోవడంతో పత్తిని గ్రామంలో ఆరు బయట నిల్వ ఉంచుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 45 లక్షల క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో గత్యంతరం లేక వ్యాపారులకే రైతులు పత్తి అమ్ముతున్నారు.
Similar News
News October 18, 2025
HYD: ఆటోవాలాకు ‘దీపావళి పండుగ’

బీసీల 42% రిజర్వేషన్ బిల్లుపై హైకోర్టు స్టే విధించడంతో అన్ని పార్టీలు ఏకకంఠంగా తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో ఆర్టీసీ చక్రాలు ఆగిపోయాయి. బస్టాప్‌లు ఆటోలతో కిక్కిరిశాయి. పాఠశాలలు మూతపడి, ఉద్యోగాలు కొనసాగడంతో ఆటోల డిమాండ్ ఆకాశాన్నంటింది. ప్రయాణికులు డబుల్ ఛార్జీకి ఒప్పుకోవాల్సి వచ్చింది. అకస్మాత్తుగా పడిన ఈ అదృష్టంతో ఆటోవాలకు ముందుగానే ‘దీపావళి’ వెలుగొచ్చిందని సంబరపడుతున్నారు.

ఈనెల 23న OTTలోకి ‘OG’

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ తెరకెక్కించిన ‘OG’ సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈనెల 23న ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్‌కు రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. గత నెల 25న రిలీజైన ఈ మూవీ సరిగ్గా 4 వారాల్లోనే OTTలోకి రాబోతోంది.