News October 17, 2025
ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో స్పాట్ అడ్మిషన్లు

సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, పీజీ కళాశాలలో ఈ విద్యాసంవత్సరం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో మొదటి సంవత్సరంలో మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాళ్లు ఎస్.జ్యోతి, నర్సింహాచారి తెలిపారు. ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తామన్నారు.
Similar News
News October 18, 2025
జనగామ: ఇటు బంద్.. అటు న్యాయమూర్తుల రాక..!

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కోసం జనగామ జిల్లాలో బీసీ బంద్ కొనసాగుతోంది. ఇప్పటికే వ్యాపార, విద్యా, వాణిజ్య స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నాయి. అయితే ఈరోజే జనగామకు హైకోర్టు న్యాయమూర్తులు వస్తున్న విషయం తెలిసిందే. వారు వచ్చే వేళ జనగామ బంద్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠమైన బందోబస్తు చేపడుతున్నారు.
News October 18, 2025
బాణసంచా విక్రయదారులకు SP సూచన.!

అనుమతి లేకుండా బాణసంచాలను విక్రయిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని జిల్లా SP హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో ప్రకటన విడుదల చేసింది. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని పోలీస్ అధికారులు, సిబ్బంది విస్తృత తనిఖీలను చేశారు. ఈ సందర్భంగా బాణసంచా విక్రయ కేంద్రాల్లో 18ఏళ్లలోపు పిల్లలను పనిలో ఉంచరాదన్నారు.
News October 18, 2025
HYD: లక్షకు పైగా మొబైల్స్ రికవరీ: సీఐడీ

తెలంగాణ సైబర్ క్రైమ్, సీఐడీ మరో రికార్డ్ సృష్టించింది. దొంగిలించబడిన, పోయిన మొబైల్స్ రికవరీలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు 1,00,020 మొబైల్స్ రికవరీ చేసి జాతీయ స్థాయిలో బెంచ్ మార్క్ సెట్ చేసింది. దేశంలోని పైలట్ ప్రాజెక్టుల కంటే ఆలస్యంగా ప్రారంభమైనా, తెలంగాణ సీఈఐఆర్ సిస్టమ్ అద్భుత ఫలితాలు సాధించింది.