News October 17, 2025
పోలీసుల అదుపులో అత్యాచారం కేసు నిందితుడు

సంత్రగాచి ఎక్స్‌ప్రెస్ మహిళా బోగిలో మంగళవారం ప్రయాణికురాలిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని తెనాలి రైల్వేస్టేషన్లో గుంటూరు GRP పోలీసులు అదుపులో తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో CC కెమెరాలను పరిశీలించి పట్టుకున్నారు. నిందితుడు పల్నాడు(D) సత్తెనపల్లి లక్కరాజుగార్లపాడుకు చెందిన జోన్నలగడ్డ రాజారావుగా గుర్తించారు. నిందితుడు గతంలో కేరళకు చెందిన మహిళపైనా అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం.
Similar News
News October 18, 2025
మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్

స్వర్ణాంధ్ర–స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా కర్నూలు నగరంలోని ఏ–క్యాంపు మున్సిపల్ పార్కులో జిల్లా కలెక్టర్ సిరి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ప్రతి వాడ, ప్రతి కాలనీలో పచ్చదనం విస్తరించేలా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
News October 18, 2025
ప్రజా రవాణా వ్యవస్థలను వినియోగించుకోవాలి: కలెక్టర్

ప్రజారవాణా వ్యవస్థలను వినియోగించుకోవాలని కలెక్టర్ విజయ్ కృష్ణన్ పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి కలెక్టరేట్‌లో నిర్వహించిన స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. వాహన కాలుష్యాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సోలార్ విద్యుత్ వినియోగం వంటి పద్ధతులను ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు.
News October 18, 2025
బంగారం నిల్వల్లో ఇండియా రికార్డు!

భారతదేశపు బంగారం నిల్వల విలువ మొదటిసారిగా $100 బిలియన్ మైలురాయిని అధిగమించింది. మొత్తంగా $102 బిలియన్లు దాటినట్లు RBI డేటా పేర్కొంటోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు అనూహ్యంగా పెరగడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. దేశ ఆర్థిక స్థిరత్వానికి ఇదెంతగానో బలం చేకూర్చనుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం RBI విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా 14.7% కి చేరింది.