News October 17, 2025
కొత్తగూడెం: మద్యానికి బానిసై యువకుడి SUICIDE

మద్యానికి బానిసైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చుంచుపల్లి మండలం గౌతంపూర్ ఏరియాలో గురువారం చోటుచేసుకుంది. సంకువార్ కార్తీక్(25) ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయాడని 2 టౌన్ సీఐ ప్రతాప్ తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్ఐ మనీషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Similar News
News October 18, 2025
కామారెడ్డి: వరి కోత యంత్రాల యజమానులకు శిక్షణ

కామారెడ్డిలో వరి కోత యంత్రాల యజమానులకు శనివారం శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్ నిర్వహించారు. వరి పంట పూర్తిగా పక్వానికి వచ్చిన తర్వాతే కోత ప్రారంభించాలని సూచించారు. యంత్రాలను 18 RPM వద్ద మాత్రమే నడపాలని, దీంతో గింజల నాణ్యత దెబ్బతినకుండా, తక్కువ తాలు గింజలు వస్తాయన్నారు. కోత సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
News October 18, 2025
HYD: రెహమాన్‌పై మూడో కేసు నమోదు

జ్యూడీషియల్ రిమాండ్‌లో ఉన్న రెహమాన్‌పై <<17999949>>మరిన్ని కేసులు నమోదయ్యే<<>> అవకాశం ఉంది. విచారణలో భాగంగా మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వ బాలల సదనంలో గతంలో మరో బాలుడిపై అతడు లైంగిక దాడి చేసినట్లు సైదాబాద్ పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా మరో 10 మంది బాలలపై కూడా లైంగిక దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రెహమాన్‌పై పోలీసులు మూడో కేసు నమోదు చేశారు.
News October 18, 2025
యార్డుల్లో ఇసుక సరఫరా పెంచాలి: కలెక్టర్

జిల్లాలో డిమాండ్‌కు తగ్గట్టుగా యార్డుల్లో ఇసుకను సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఇసుక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 16 నుండి ఇసుక రీచ్‌లలో త్రవ్వకాల పునరుద్ధరణ కార్యక్రమంపై సమీక్షించారు. స్టాక్ యార్డులలో ఉన్న ఇసుక వివరాలను గనుల శాఖ అధికారులు నిత్యం ఆన్‌లైన్‌లో పెట్టాలని సూచించారు.