News October 17, 2025
NLG: ఆ 7 దుకాణాలకు బోణీ కాలేదు!

జిల్లాలో 154 మద్యం దుకాణాలు ఉన్నాయి. అందులో 7 మద్యం దుకాణాలకు టెండర్ దరఖాస్తులు బోణీ కాలేదు. ఇందులో దేవరకొండలో 70, చండూరులో 106, 108వ నెంబర్, ఓపెన్ కేటగిరి షాపులు, హాలియాలోని 128, 129 , 130 ఎస్సీ రిజర్వు, నాంపల్లిలోని 14వ నెంబరు ఎస్సీ రిజర్వ్ షాపులు ఉన్నాయి. గతంలో 757 దరఖాస్తులు రాగా.. ఇప్పుడు అందులో సగం కూడా దరఖాస్తులు రాకపోవడం గమనార్హం.
Similar News
News October 18, 2025
న్యాయ అవగాహన పెంపులో పీఎల్‌వీల సేవ కీలకం: జడ్జి పురుషోత్తం రావు

సమాజంలో న్యాయ అవగాహన కల్పించడమే పారా లీగల్ వాలంటీర్ల(పీఎల్‌వీ) ప్రధాన లక్ష్యమని జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పురుషోత్తం రావు అన్నారు. పీఎల్‌వీల ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. న్యాయం అందరికీ చేరేలా పీఎల్‌వీలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో జరగబోయే జాతీయ కాన్ఫరెన్స్‌కు ఎంపికైన శ్రీకాంత్‌ను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.
News October 18, 2025
NLG: టెండర్ల జాతర.. ఒక్క షాపుకే 100 దరఖాస్తులు !

ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాల టెండర్లకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇవాళ చివరి రోజు కావడంతో ఉదయం నుంచే ఎక్సైజ్ కార్యాలయాలు కిటకిటలాడాయి. ఉమ్మడి జిల్లాలో 329 షాపులకు టెండర్లు స్వీకరిస్తున్నారు. అయితే నల్గొండ జిల్లా ధర్వేశిపురం వైన్స్ కోసం 100కు పైగా టెండర్లు దాఖలైనట్లు సమాచారం. నేడు బంద్ కారణంగా కొంత ఇబ్బంది కలిగినప్పటికీ DDలు తీసి ఉంటే రాత్రి వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
News October 18, 2025
నాగార్జునసాగర్‌లో గవర్నర్ నజీర్‌కు కలెక్టర్ స్వాగతం

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ నాగార్జునసాగర్ పర్యటనకు విచ్చేసిన సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆయనకు ఘన స్వాగతం పలికారు. గవర్నర్ పర్యటన దృష్ట్యా సాగర్ పరిసరాల్లో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారులు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.