News October 17, 2025

ఆర్మీ క్యాంప్‌పై ‘ఉల్ఫా’ అటాక్

image

అస్సాంలో ఉల్ఫా మిలిటెంట్లు రెచ్చిపోయారు. తిన్‌సుకియా జిల్లాలోని కాకోపతార్ ప్రాంతంలో ఆర్మీ క్యాంప్‌పై అర్ధరాత్రి అటాక్ చేశారు. గ్రెనేడ్లు విసిరి తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. ట్రక్కులో వచ్చిన మిలిటెంట్లు సుమారు 30 నిమిషాల పాటు దాడులు చేసి పారిపోయారు. దీంతో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు స్థానిక అడవుల్లో మిలిటెంట్ల కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.

Similar News

News October 18, 2025

ఘోర ప్రమాదం… 8 మంది భక్తుల మృతి

image

మహారాష్ట్రలోని చాంద్‌షాలి ఘాట్ వద్ద పికప్ వ్యాను లోయలో పడి 8మంది భక్తులు మరణించారు. ఇష్టదైవం అస్తంబా దేవీయాత్ర ముగించుకొని తిరిగి వస్తున్న భక్తుల వ్యాను ఘాట్ రోడ్డు మలుపు వద్ద అదుపు తప్పి లోయలోకి దూసుకుపోయింది. వ్యాను తునాతునకలు కాగా భక్తులు వాహనం కింద పడిపోయారు. 8మంది అక్కడికక్కడే మరణించగా మరో 8మందికి తీవ్ర గాయాలయ్యాయి. అత్యంత వేగంతో వెళ్తూ డ్రైవర్ పట్టుకోల్పోవడమే దీనికి కారణంగా పేర్కొంటున్నారు.

News October 18, 2025

జిప్‌మర్‌లో 118 పోస్టులు

image

పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(JIPMER)118 సీనియర్ రెసిడెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి డిగ్రీ, PG, MD, MS, DNB, DM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవంగల అభ్యర్థులు నవంబర్ 3వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

News October 18, 2025

కోడిపిల్లల పెంపకం.. ముఖ్యమైన సూచనలు

image

షెడ్‌లోకి కోడి పిల్లలను వదిలిన తర్వాత ప్రతిరోజూ 2 లేదా 3 సార్లు వాటి ప్రవర్తన, ఆరోగ్యస్థితిని పరిశీలించాలి. చిన్న పిల్లలను పెంచే షెడ్డుకు, పెద్ద కోళ్లను ఉంచే షెడ్‌కు మధ్య కనీసం 100 గజాల దూరం ఉండేలా చూసుకోవాలి. కోడి పిల్లలను ఉంచే షెడ్‌లో లిట్టరు పొడిగా ఉండేట్లు జాగ్రత్తపడాలి. కోడి పిల్లలను పెంచే షెడ్ వైపునకు నాటు కోళ్లను రానీయకూడదు. చలి గాలులు సోకకుండా షెడ్డుకు ఇరువైపులా పరదాలను వేలాడదీయాలి.