News October 17, 2025
జూబ్లీ బై పోల్: పనులను నిలిపివేయనున్న కాంట్రాక్టర్లు

జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు తమ నిరసన వ్యక్తం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈరోజు మ.3 గంటలకు జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌లో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ బయ్‌కాట్ చేయాలని వారు నిర్ణయించుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా వాళ్లు పేర్కొన్నారు. సమావేశం తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
Similar News
News October 18, 2025
HYD: రెహమాన్‌పై మూడో కేసు నమోదు

జ్యూడీషియల్ రిమాండ్‌లో ఉన్న రెహమాన్‌పై <<17999949>>మరిన్ని కేసులు నమోదయ్యే<<>> అవకాశం ఉంది. విచారణలో భాగంగా మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వ బాలల సదనంలో గతంలో మరో బాలుడిపై అతడు లైంగిక దాడి చేసినట్లు సైదాబాద్ పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా మరో 10 మంది బాలలపై కూడా లైంగిక దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రెహమాన్‌పై పోలీసులు మూడో కేసు నమోదు చేశారు.
News October 18, 2025
HYD: ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద BRS నేతల నిరసన

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ హామీ అమలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా భూస్థాపితం చేస్తామని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో జరిగిన బీసీ బంద్ ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల ఆత్మగౌరవం కోసం పోరాటం కొనసాగుతుందని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
News October 18, 2025
HYD: ఆటోవాలాకు ‘దీపావళి పండుగ’

బీసీల 42% రిజర్వేషన్ బిల్లుపై హైకోర్టు స్టే విధించడంతో అన్ని పార్టీలు ఏకకంఠంగా తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో ఆర్టీసీ చక్రాలు ఆగిపోయాయి. బస్టాప్‌లు ఆటోలతో కిక్కిరిశాయి. పాఠశాలలు మూతపడి, ఉద్యోగాలు కొనసాగడంతో ఆటోల డిమాండ్ ఆకాశాన్నంటింది. ప్రయాణికులు డబుల్ ఛార్జీకి ఒప్పుకోవాల్సి వచ్చింది. అకస్మాత్తుగా పడిన ఈ అదృష్టంతో ఆటోవాలకు ముందుగానే ‘దీపావళి’ వెలుగొచ్చిందని సంబరపడుతున్నారు.