News April 8, 2024
అనకాపల్లిలో చిన్నారిని ఎత్తుకున్న పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనకాపల్లిలో నిర్వహించిన రోడ్ షోలో ప్రజలను ఆకట్టుకునే విధంగా వ్యవహరించారు. ఓ చిన్నారిని ఎత్తుకున్న సీన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే అనకాపల్లి ప్రజల సెంటిమెంట్ అయిన నూకాంబిక అమ్మవారిని తలుచుకుని ప్రసంగాన్ని ప్రారంభించారు. కూటమి అధికారంలోకి వస్తే నూకాంబిక జాతరకు రాష్ట్రస్థాయి గుర్తింపు కల్పిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
Similar News
News September 10, 2025
విశాఖ: ‘రాత్రి వేళల్లో అదనపు సర్వీసులు వేయాలి’

విశాఖలో రాత్రి సమయంలో ఆర్టీసీ బస్సులు అదనపు సర్వీసులు నిర్వహించాలని పలువురు ప్రయాణికులు కోరారు. బుధవారం జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు డైల్ యువర్ ఆర్‌ఎం ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రయాణికులు ఆయనకు పలు సూచనలు చేశారు. కాకినాడ, రాజమండ్రి ప్రాంతాలకు ఎక్స్‌ప్రెస్ సర్వీసులు వేయాలని కోరారు. నిర్ణీత సమయానికి గమ్యస్థానాలకు చేరుకునే విధంగా బస్సులు నడపాలన్నారు.
News September 10, 2025
విశాఖలో ఈ-వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రం ప్రారంభం

విశాఖ మెడటెక్ జోన్‌లో అత్యాధునిక ఈ-వ్యర్థాల ప్రాసెసింగ్ సెంటర్ ప్రారంభమైంది. ప్రొఫెసర్ అజయ్‌కుమార్ సూద్ (ప్రధాన శాస్త్రీయ సలహాదారు), డా.పర్వీందర్ మైనీ (శాస్త్రీయ కార్యదర్శి), మెడటెక్ జోన్ సీఈవో జితేంద్ర శర్మ, GVMC కమిషనర్ కేతన్ గార్గ్ తదితరులు ప్రారంభించారు. ఎలక్ట్రానిక్, బయోమెడికల్ పరికరాల వ్యర్థాలను శాస్త్రీయంగా రీసైకిల్ చేసి మళ్లీ వినియోగించేలా ఈ కేంద్రం పని చేస్తుందని అధికారులు తెలిపారు.
News September 10, 2025
గాజువాక: మేడ మీద నుంచి దూకి వివాహిత ఆత్మహత్య

మానసిక అనారోగ్య కారణాలతో వివాహిత భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. వడ్లపూడికి చెందిన ప్రత్యూషకు రాంబిల్లికి చెందిన సతీశ్‌తో వివాహం కాగా కూర్మన్నపాలెంలోని అద్దెకి ఉంటున్నారు. మానసిక ఒత్తిడి, నిద్రలేమితో బాధపడుతున్న ఆమె ఆత్మహత్య చేసుకుందని దువ్వాడ సిఐ మల్లేశ్వరరావు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.