News October 17, 2025

బంజారాహిల్స్: బంద్ ఫర్ జస్టిస్‌కు కవిత మద్దతు

image

‘బంద్ ఫర్ జస్టిస్’కు మద్దతునివ్వాలని కోరుతూ ‘తెలంగాణ బీసీ జేఏసీ’ ఛైర్మన్ ఆర్.కృష్ణయ్య తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకి లేఖ రాశారు. బంద్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు కవిత ప్రకటించారు. బీసీల రిజర్వేషన్ల పెంపుపై మాట్లాడేందుకు కాంగ్రెస్, బీజేపీకి అర్హత లేదన్నారు. రెండు జాతీయ పార్టీలు బీసీలను వంచిస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంపిన బిల్లులను బీజేపీ కావాలనే పెండింగ్‌లో పెడుతోందన్నారు.

Similar News

News October 17, 2025

సిరిసిల్ల: సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్

image

సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని సిరిసిల్ల అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్‌లో ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణపై IKP సెంటర్ల బాధ్యులకు శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం గ్రే ఏడు రకానికి రూ.2389, కామన్ రకానికి రూ.2369 ధరను ప్రభుత్వం నిర్ణయించిందని స్పష్టం చేశారు. సన్నరకం ధాన్యం క్వింటాలకు అదనంగా రూ.500 ప్రభుత్వం ఇస్తుందన్నారు.

News October 17, 2025

చిత్తూరు: విద్యుత్ షాక్ తగిలి యువకుడి మృతి

image

తెలంగాణ(S) కామారెడ్డి(D) నాగిరెడ్డి పేటలో శుక్రవారం విద్యుత్ షాక్ తగిలి ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు(D) రామసముద్రం గ్రామానికి చెందిన సయ్యద్ చోటు బాతులను మేపుకుంటూ వెళ్తుండగా కొన్ని బాతులు పొలంలోకి వెళ్లాయి. వాటిని తీసుకురావడానికి వెళ్లగా పొలంలో స్టాటర్ డబ్బా వైర్లు అతని కాలుకు తగిలి షాక్‌కు గురయ్యాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News October 17, 2025

జమ్మికుంట: క్వింటా పత్తి ధర రూ.6,800

image

జమ్మికుంట పత్తి మార్కెట్‌లో పత్తి ధర శుక్రవారం రూ.6,800 పలికింది. ఈరోజు మార్కెట్‌కు రైతులు 159 వాహనాల్లో 1238 క్వింటాల విడి పత్తి విక్రయానికి తీసుకురాగా.. రూ.5,000, నుంచి రూ.6,800 దాకా పలికింది. గోనె సంచుల్లో 31 మంది రైతులు 43 క్వింటాలు తీసుకురాగా.. రూ.4,800, నుంచి రూ.6,000 దాకా పలికింది. రేపటి నుంచి మార్కెట్‌కు వరుసగా 4 రోజులు సెలవు ఉంటుందని మార్కెట్ కార్యదర్శి మల్లేశం తెలిపారు.