News October 17, 2025
పోలవరం నిర్వాసితులకు రూ.1,100 కోట్లు విడుదల

పోలవరం ప్రాజెక్టు 41.15 కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పరిహారం అందించేందుకు ప్రభుత్వం తాజాగా రూ. 1,100 కోట్లు విడుదల చేసింది. వ్యక్తిగత పునరావాసం, కోల్పోతున్న ఇళ్లకు, ఇంటిస్థలం వద్దనుకున్న వారికి ఈ పరిహారం చెల్లిస్తారు. జనవరిలో కొంతమందికి పరిహారం జమ కాగా, మిగిలిన వారికి ఈసారి ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉందని సమాచారం.
Similar News
News October 17, 2025
సిరిసిల్ల: సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్

సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని సిరిసిల్ల అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్‌లో ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణపై IKP సెంటర్ల బాధ్యులకు శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం గ్రే ఏడు రకానికి రూ.2389, కామన్ రకానికి రూ.2369 ధరను ప్రభుత్వం నిర్ణయించిందని స్పష్టం చేశారు. సన్నరకం ధాన్యం క్వింటాలకు అదనంగా రూ.500 ప్రభుత్వం ఇస్తుందన్నారు.
News October 17, 2025
చిత్తూరు: విద్యుత్ షాక్ తగిలి యువకుడి మృతి

తెలంగాణ(S) కామారెడ్డి(D) నాగిరెడ్డి పేటలో శుక్రవారం విద్యుత్ షాక్ తగిలి ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు(D) రామసముద్రం గ్రామానికి చెందిన సయ్యద్ చోటు బాతులను మేపుకుంటూ వెళ్తుండగా కొన్ని బాతులు పొలంలోకి వెళ్లాయి. వాటిని తీసుకురావడానికి వెళ్లగా పొలంలో స్టాటర్ డబ్బా వైర్లు అతని కాలుకు తగిలి షాక్‌కు గురయ్యాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
News October 17, 2025
జమ్మికుంట: క్వింటా పత్తి ధర రూ.6,800

జమ్మికుంట పత్తి మార్కెట్‌లో పత్తి ధర శుక్రవారం రూ.6,800 పలికింది. ఈరోజు మార్కెట్‌కు రైతులు 159 వాహనాల్లో 1238 క్వింటాల విడి పత్తి విక్రయానికి తీసుకురాగా.. రూ.5,000, నుంచి రూ.6,800 దాకా పలికింది. గోనె సంచుల్లో 31 మంది రైతులు 43 క్వింటాలు తీసుకురాగా.. రూ.4,800, నుంచి రూ.6,000 దాకా పలికింది. రేపటి నుంచి మార్కెట్‌కు వరుసగా 4 రోజులు సెలవు ఉంటుందని మార్కెట్ కార్యదర్శి మల్లేశం తెలిపారు.