News October 17, 2025
దేశ అభివృద్ధికి యువతే వెన్నెముక: కలెక్టర్

భారతదేశ అభివృద్ధికి యువతే వెన్నెముకని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. యువతలోని శక్తి, మేధోసంపత్తి సమాజానికి ఎంతో ఉపయోగపడాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా యువజన వ్యవహారాల శాఖ స్టెప్ ఆధ్వర్యంలో శుక్రవారం ఒంగోలులోని స్థానిక ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన జిల్లా స్థాయి యువజన ఉత్సవాల్లో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. యువత దేశ ఉన్నతికి పాటుపడాలన్నారు.
Similar News
News October 19, 2025
ప్రకాశంకు భారీ వర్ష సూచన

ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, దీని ప్రభావంతో జిల్లాలో ఆదివారం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ శనివారం ప్రకటించింది. కాగా శనివారం సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు జిల్లాలో కురిశాయి. ఆదివారం పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ప్రజలు జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు.
News October 18, 2025
ప్రకాశం జిల్లాలో పోలీసుల దాడులు

జిల్లాలో అనుమతి లేకుండా బాణాసంచా విక్రయ కేంద్రాలను నిర్వహిస్తున్న వారిపై శనివారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు అధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. కనిగిరి–1, మద్దిపాడు–1, పామూరు–2, వెలిగండ్ల–1, మార్కాపురం టౌన్–1 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి రూ.1,38,944 విలువ గల బాణాసంచాలు సీజ్ చేసినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అనుమతి లేకుండా టపాసులు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News October 18, 2025
ప్రకాశం జిల్లా వైసీపీ బీసీ సెల్ జనరల్ సెక్రెటరీగా గాంధీ

చీమకుర్తికి చెందిన తెల్లమేకల గాంధీని ప్రకాశం జిల్లా వైసీపీ బీసీ సెల్ జనరల్ సెక్రెటరీగా పార్టీ అధిష్టానం నియమించింది. తనను నమ్మి పార్టీ ఇచ్చిన పదవికి న్యాయం చేస్తానని గాంధీ తెలిపారు. పార్టీ అభివృద్ధికి అహర్నిశలు పని చేస్తానన్నారు. ఆయనకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.