News October 17, 2025
సిరిసిల్ల: ‘పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్ట పరచాలి’

పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు VPO వ్యవస్థ కలిగి ఉండాలని సిరిసిల్ల SP మహేష్ బీ గీతే అన్నారు. సిరిసిల్లలోని SP కార్యాలయంలో సిరిసిల్ల సబ్ డివిజన్ అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెట్రోలింగ్ వ్యవస్థను మరింత పటిష్ట పరచాలన్నారు. శాంతి భద్రతలకు విగాథం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
Similar News
News October 18, 2025
భార్యకు మంత్రి పదవి.. గర్వంగా ఉందన్న జడేజా

తన భార్య రివాబా జడేజాకు గుజరాత్ మంత్రివర్గంలో చోటు దక్కడంపై స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా హర్షం వ్యక్తం చేశారు. ‘నీవు సాధించిన విజయాలకు ఎంతో గర్వపడుతున్నా. అన్ని వర్గాల ప్రజలకు ప్రేరణగా నిలుస్తావని ఆశిస్తున్నా. మంత్రిగా గొప్ప విజయాలు సాధిస్తావని ఆకాంక్షిస్తున్నా. జైహింద్’ అని ట్వీట్ చేశారు. కాగా రివాబాకు విద్యాశాఖను కేటాయించారు.
News October 18, 2025
KNR: ‘చట్టాలపై అవగాహన అవసరం’

తిమ్మాపూర్ మండలంలోని డైట్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా సీనియర్ సివిల్ జడ్జి కే. వెంకటేష్ మాట్లాడుతూ, న్యాయ విజ్ఞాన సదస్సుల ద్వారా ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. మోటార్ వెహికల్ చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, పోక్సో యాక్ట్ వంటి చట్టాలపై ఆయన అవగాహన కల్పించారు. సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా మెలగాలని ఆయన సూచించారు.
News October 18, 2025
ఇవాళ ఒక్కరోజే 23వేల అప్లికేషన్లు

TG: లిక్కర్ షాప్స్‌కు ఈరోజు రికార్డు స్థాయిలో అప్లికేషన్స్ వచ్చాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఇవాళ ఒక్కరోజే 23 వేల దరఖాస్తులు వచ్చాయని, ఇప్పటివరకు మొత్తం 50వేలు దాటాయని పేర్కొంది. శనివారం చివరి రోజు కావడంతో మరో 50 వేలు అప్లికేషన్స్ వస్తాయని అంచనా వేస్తోంది. కాగా రాష్ట్రంలో 2,620 మద్యం షాపులకు దరఖాస్తులు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే.