News October 17, 2025
భారత్ మౌనంగా ఉండదు: మోదీ

కొవిడ్ తర్వాత ప్రపంచంలో వరుస యుద్ధాలు, ఉద్రిక్తతలు కొనసాగినా భారత్ అభివృద్ధిలో ముందుకెళ్లిందని ప్రధాని మోదీ NDTV సమ్మిట్‌లో అన్నారు. సగటున 7.8% వృద్ధిరేటు సాధిస్తోందని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై దేశం మౌనంగా ఉండదని.. సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్, ఆపరేషన్ సిందూర్ రూపంలో వారికి గట్టిగా బదులిచ్చామని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం బ్యాంకింగ్ సెక్టార్‌లో సంస్కరణలు తెచ్చిందని వివరించారు.
Similar News
News October 21, 2025
దానధర్మాలు చేస్తే మోక్షం లభిస్తుందా?

దానం చేసేటప్పుడు ‘నాకు పుణ్యం దక్కాలి’ అని ఆశించకూడదు. ‘నేను దానం చేశాను’ అనే అహంకారం ఉండకూడదు. లేకపోతే ఆ దానం చేసినందుకు పుణ్యం లభించదని పండితులు చెబుతున్నారు. ‘దానం చేయడం ద్వారా మనసు శుభ్రపడుతుంది. చిత్త శుద్ధి పెరుగుతుంది. ఈ శుభ్రమైన మనసుతోనే మనం జ్ఞానాన్ని పొందగలం. ఈ జ్ఞానమే మనకు జనన మరణాల నుంచి విముక్తిని కలిగిస్తుంది. ఫలితంగా మోక్షం లభిస్తుంది. దానం మాత్రమే మోక్షాన్ని ఇవ్వదు’ అంటున్నారు.
News October 21, 2025
బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 50 మేనేజర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, CA/CMA/CS/CFA, డిప్లొమా(ఫైనాన్స్ ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.850, SC, ST, PWBDలకు రూ.175. *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News October 21, 2025
ప్రసారభారతిలో 59 ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<