News October 17, 2025
సిరిసిల్ల: ‘23,387 మంది వయోజనులను గుర్తించాం’

ఈ సంవత్సరం జిల్లాలో 23,387 మంది వయోజనులను గుర్తించామని సిరిసిల్ల కలెక్టర్ ఎం హరిత అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిరక్షరాస్య వయోజన మహిళలకు అక్షరాస్యతపై అవగాహన కల్పించాలన్నారు. వాలంటీర్ల కోసం మార్గదర్శని పుస్తకాలను ప్రభుత్వం పంపించిందన్నారు. వికాసం పుస్తకాలు 21,894, మార్గదర్శిని పుస్తకాలు 2,190 వచ్చాయన్నారు.
Similar News
News October 18, 2025
చీర కట్టినప్పుడు పొడవుగా కనిపించాలంటే..

కాస్త ఎత్తు తక్కువగా ఉండి, లావుగా ఉన్నవారు కొన్ని టిప్స్ పాటిస్తే చీర కట్టుకున్నప్పుడు పొడవుగా, అందంగా కనిపిస్తారంటున్నారు ఫ్యాషన్ నిపుణులు. మృదువైన సిల్కు ప్లెయిన్ చీరకు చిన్న అంచు ఉన్నవి ఎంచుకోవాలి. దీనిపై మీడియం ప్రింట్స్ ఉన్న బ్లౌజ్ వెయ్యాలి. డీప్‌నెక్ బ్లౌజ్ వేసుకోవాలి. పెద్ద బోర్డర్లున్న చీరలు, పెద్ద ప్రింట్స్ ఉన్నవి ఎంచుకోకూడదు. నెక్ విషయానికొస్తే హైనెక్, క్లోజ్ నెక్‌కు దూరంగా ఉండాలి.
News October 18, 2025
తిరుపతి హాథీరాంజీ మఠం పూర్తిగా శిథిలం.?

తిరుపతిలోని హాథీరాంజీ మఠంపై అధికారుల అధ్యయనం పూర్తి అయినట్లు సమాచారం. మఠంలోని చాలా భాగం పూర్తిగా శిథిలం అయినట్లు తెలుస్తోంది. అధికారులు, స్థానిక నాయకులు హాథీరాంజీ వంశస్థులతో చర్చలు జరిపి తుది నిర్ణయాన్ని త్వరలోనే తీసుకోనున్నారట. కూలగొట్టే పరిస్థితి వస్తే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకు ఇచ్చి ప్రాచీన కట్టడాలు కాపాడుకొనేలా ప్రయత్నం చేయాలని బంజారా సంఘాలు కోరుతున్నట్లు సమాచారం.
News October 18, 2025
రాష్ట్రంలో 34 ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<