News October 17, 2025

WNP జిల్లాలో TODAY.. టాప్ HEADLINES

image

✔️PBR: బంద్‌ను విజయవంతం చేయాలి.
✔️PNGL: చేపల వలలో చిక్కిన మొసలి.
✔️WNP: ప్రజలకు డ్రగ్స్ ఇన్స్పెక్టర్ విజ్ఞప్తి.
✔️కెమెరా వంద మందితో సమానం: SP
✔️ప్రారంభానికి సిద్దంగా ఉన్న ఇండోర్ స్టేడియం.
✔️మునిసిపల్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం.
✔️సైబర్ మోసాల పై ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: CI.
✔️CPR పై అవగాహనా పెంచుకోవాలి: DMHO.
✔️ బీసీ జెఏసీ బంద్‌కు బీజేపీ సంపూర్ణ మద్దతు.

Similar News

News October 21, 2025

మీ నిస్వార్థ సేవకు సలామ్!❤️

image

దీపావళికి లక్ష్మీ పూజకు ఏర్పాట్లు చేస్తోన్న ఓ మహిళా డాక్టర్‌కు ‘ఎమర్జెన్సీ’ అని ఫోన్ వచ్చింది. మిగతా డాక్టర్లు సెలవులో ఉండటంతో ఆమె పూజను వదిలి తన బాధ్యతకు ప్రాధాన్యతనిచ్చారు. పిండంలో కదలికలు లేకపోవడంతో ఆందోళనలో ఉన్న ఓ గర్భిణికి ఆపరేషన్ చేసి బిడ్డను కాపాడారు. తన ఇంట్లో లక్ష్మిని వదిలి వచ్చినా.. మరో ఇంటి లక్ష్మీదేవికి ప్రాణం పోశానంటూ ఆమె ట్వీట్ చేశారు. నిస్వార్థంగా సేవచేసే వైద్యులకు సలామ్!

News October 21, 2025

కవిటి: ఆ గ్రామం ఆదర్శం..!

image

కవిటి (M) పొందూరు పుట్టుగ గ్రామం దీపావళి పండగకు దూరంగా ఉంది. కారణం ఏమిటంటే..? ఈ నెల 16న జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు దూగాన రామ్మూర్తి (44), ప్రణయ్ (17) తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీపావళి నాడు బాధిత కుటుంబంలో అమావాస్య చీకట్లు అల్లుకున్నాయని గ్రామస్థులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

News October 21, 2025

వంటింటి చిట్కాలు

image

* ఫ్రిడ్జ్‌లో బాగా వాసన వస్తుంటే ఒక చిన్న కప్పులో బేకింగ్ సోడా వేసి ఒక మూలన పెడితే వాటన్నిటినీ పీల్చుకుంటుంది.
* బంగాళదుంప ముక్కలను పదినిమిషాలు మజ్జిగలో నానబెట్టి, తర్వాత ఫ్రై చేస్తే ముక్కలు అతుక్కోకుండా వస్తాయి.
* దోశలు కరకరలాడుతూ రావాలంటే మినప్పప్పు నానబెట్టేటపుడు, గుప్పెడు కందిపప్పు, స్పూను మెంతులు, అటుకులు వేయాలి.
* కందిపప్పు పాడవకుండా ఉండాలంటే ఎండుకొబ్బరి చిప్పను ఆ డబ్బాలో ఉంచాలి.