News October 18, 2025

ఒకేసారి ఇద్దరు యువతులతో యువకుడి పెళ్లి!

image

ఒక్కరితో సంసారమే కష్టమవుతోన్న ఈ రోజుల్లో ఓ యువకుడు ఒకేసారి ఇద్దరు యువతుల్ని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గలో జరిగింది. వసీమ్ షేక్ తన ఇద్దరు స్నేహితురాళ్లు షిఫా షేక్, జన్నత్‌ను ఒకే వేదికపై పెళ్లాడాడు. వాళ్లు ముగ్గురూ చాలా ఏళ్లుగా క్లోజ్ ఫ్రెండ్స్ అని, ఒకరి భావోద్వేగాలను మరొకరు అర్థం చేసుకుని ఇలా ఒక్కటయ్యారని సన్నిహితులు తెలిపారు. దీనిపై SMలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Similar News

News October 18, 2025

BCలను రోడ్డెక్కించిన ‘రాజకీయం’.. కారణమెవరు?

image

తెలంగాణలో బీసీల పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. రాజకీయాల్లో 42శాతం రిజర్వేషన్లతో రాజ్యమేలుతారనుకుంటే బంద్‌‌తో రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం హడావిడిగా బిల్లు రూపొందించడం, దాన్ని గవర్నర్ పెండింగ్‌లో పెట్టడం, హైకోర్టు, సుప్రీంకోర్టు స్టే విధించడంతో తమ ‘నోటికాడ ముద్ద’ లాగేసుకున్నారని బీసీలు మండిపడుతున్నారు. ఇంతకీ ఈ పరిణామానికి కారణమెవరు? Comment

News October 18, 2025

అత్యంత భారీగా తగ్గిన వెండి ధరలు

image

ధన త్రయోదశి వేళ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కేజీ వెండిపై ఏకంగా రూ.13వేలు తగ్గి రూ.1,90,000కు చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,910 తగ్గి రూ.1,30,860గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,750 పతనమై రూ.1,19,950కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలున్నాయి.

News October 18, 2025

దీపావళి వ్యాపారంపై బంద్ ప్రభావం?

image

TG: దీపావళి పండుగకు 2 రోజుల ముందు వచ్చిన ‘రాష్ట్ర బంద్‌’ పండుగ వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం చూపనుంది. వారాంతం కూడా కావడంతో ప్రజలు దీపావళి షాపింగ్ చేయడానికి సిద్ధమయ్యారు. వస్త్ర, గోల్డ్, స్వీట్స్‌ దుకాణదారులు ఇవాళ భారీ వ్యాపారాన్ని ఆశించారు. కానీ బీసీ సంఘాల బంద్ పిలుపుతో జనం రాక తగ్గి బిజినెస్‌పై ఎఫెక్ట్ పడుతుందని వారు ఆందోళనలో ఉన్నారు. బంద్ ప్రభావం ఎంతో సాయంత్రానికి క్లారిటీ వస్తుంది.