News October 18, 2025
ఎస్సీ, ఎస్టీ గురుకులాలకు రూ. 220 కోట్ల బకాయిలు: కొప్పుల ఈశ్వర్

జిల్లా మంత్రి లక్ష్మణ్ కుమార్ పరిధిలోని సంక్షేమ శాఖ ద్వారా ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలలకు రావాల్సిన రూ. 220 కోట్ల బకాయిలు ఇంకా చెల్లించబడలేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. జగిత్యాలలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. బిల్లులు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, సరుకుల సరఫరా కూడా నిలిచిపోయిందని కొప్పుల తెలిపారు.
Similar News
News October 18, 2025
తెలంగాణ రైసింగ్ విజన్-2047లో భాగస్వాములు కావాలి: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ రైసింగ్ విజన్-2047 సర్వేలో అన్ని వర్గాల వారు భాగస్వాములు కావాలని కలెక్టర్ దివాకర్ టీఎస్ పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో తెలంగాణ అభివృద్ధికి, సంక్షేమానికి తమ విలువైన సూచనలు సలహాలు అందించాలని కలెక్టర్ అన్నారు. http//www.telangan.gov.in/telanganarising వెబ్‌సైట్ లింకు ద్వారా సర్వేలో పాల్గొనాలని కలెక్టర్ సూచించారు.
News October 18, 2025
డిప్యూటీ కలెక్టర్‌గా గౌకనపల్లి వాసికి పదోన్నతి

N.P. కుంట మండలం గౌకనపల్లికి చెందిన మహబూబ్ బాషాకు డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి వచ్చింది. కూడేరు మండల ఇంఛార్జ్ తహసీల్దార్‌గా ప్రస్తుతం మహబూబ్ బాషా విధులు నిర్వహిస్తున్నారు. నిరుపేద రైతు కుటుంబంలో పుట్టిన మహబూబ్ బాషా ఉపాధ్యాయుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టి డిప్యూటీ తహసీల్దారు, తహసీల్దారుగా చేసిన ఆయన డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొందడంతో ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
News October 18, 2025
బ్రిటన్‌లో ‘ఆధార్’ తరహా వ్యవస్థ?

ఆధార్ కార్డు తరహా వ్యవస్థను UKలో తీసుకురావాలని ఆ దేశ PM స్టార్మర్ భావిస్తున్నారు. తమ డిజిటల్ ఐడెంటిటీ ప్రోగ్రామ్ ‘బ్రిట్ కార్డ్’కు ఆధార్‌ను ప్రేరణగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే భారత్‌లో మాదిరి సంక్షేమం, సర్వీసుల కోసం కాకుండా ఇల్లీగల్ మైగ్రెంట్ వర్కర్ల కట్టడికి ఈ వ్యవస్థను వాడుకోనున్నట్లు సమాచారం. తన ముంబై పర్యటన సందర్భంగా ఆధార్ రూపకల్పనలో కీలకంగా వ్యవహరించిన వారితో స్టార్మర్ భేటీ అయ్యారు.