News October 18, 2025
మేడారం అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్

మేడారంలో జరిగే సమ్మక్క-సారలమ్మ గద్దెల అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని సంబంధిత అధికారులను కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. గద్దెల ప్రాంగణంలో జరుగుతున్న పనులను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన నమూనా ప్రకారం పనులను సకాలంలో పూర్తి చేయాలని అన్నారు. కలెక్టర్ వెంట ఎండోమెంట్ అధికారులు, స్థానిక పూజారులు ఉన్నారు.
Similar News
News October 18, 2025
బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే పిల్లలు పుట్టరా?

ప్రస్తుతకాలంలో చిన్నవయసులోనే చాలామంది బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఈ చికిత్స వల్ల అండాశయాలు బలహీనమై పిల్లలు పుట్టడం కష్టమవుతుందంటున్నారు నిపుణులు. అందుకే క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌కి ముందే ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ చేయాలని సూచిస్తున్నారు. అండాశయ బాహ్యపొరలో ఉండే అపరిపక్వ అండాలను చికిత్సకు ముందే తీసి ఫ్రీజ్&ప్రిజర్వ్ చేస్తారు. తర్వాత తిరిగి బాడీలో ఇంప్లాంట్ చేస్తే గర్భం దాల్చే అవకాశముంటుంది.
News October 18, 2025
పుతిన్‌ను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం

ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు(ICC) వారెంట్ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. త్వరలో హంగేరీ వేదికగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్‌తో భేటీ అయ్యాక ఆయనను అదుపులోకి తీసుకుంటారని వార్తలొస్తున్నాయి. అయితే అలాంటిదేమీ ఉండదని సమాచారం. ICCకి అరెస్ట్ చేసే అధికారం లేదు. అందులోని సభ్యదేశాలే ఈ పనిచేయాలి. కాగా పుతిన్‌కు భద్రత కల్పిస్తామని హంగేరీ PM చెప్పడం గమనార్హం.
News October 18, 2025
KNR: దరఖాస్తులకు స్పందన కరవు.. రీటెండరింగ్ తప్పదా?

2025-27కు గాను వైన్ షాప్ టెండర్లకు ఈ సారి ప్రభుత్వం ఆశించిన మేర స్పందన లేదు. ఒక్క షాప్‌కు 10 కంటే దరఖాస్తులు తక్కువ వస్తే రీ టెండర్ చేయాలన్న నిబంధన ఉంది. ఉమ్మడి KNR జిల్లా వ్యాప్తంగా సుమారు 45 షాపుల వరకు 1, 2 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. దరఖాస్తులకు చివరి రోజు బీసీ రిజర్వేషన్ల బంద్ ప్రభావం పడే అవకాశం కూడా ఉంది. ఇప్పటికీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 287 వైన్ షాపులకు గాను 3261 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.