News October 18, 2025
VZM: బాల సంరక్షణ కేంద్రాలకు ధ్రువపత్రాల పంపిణీ

బాలల సరంక్షణా కేంద్రాలకు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి శుక్రవారం ధృవప్రతాలను పంపిణీ చేశారు. జిల్లాలోని మూడు బాల సదనాలు, ఒక చిల్డ్రన్ హోమ్, ఒక శిశుగృహ హోమ్, 4 చైల్డ్ కేర్ ఎన్‌జిఓ హోమ్స్ కు ఫైనల్ సర్టిఫికెట్స్ అందజేశారు. జిల్లాలోని శిశు సంరక్షణ సంస్థలపై పర్యవేక్షణను మరింత బలోపేతం చేయడానికి ఈ జిల్లా స్థాయి తనిఖీ కమిటీ పనిచేస్తుందని ఆయన తెలిపారు.
Similar News
News October 21, 2025
విజయనగరం జిల్లాలో 229 మందికి పదోన్నతులు

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు విజయనగరం జిల్లాలోని ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్, మెకానిక్ సహా 23 కేటగిరీల సిబ్బందికి పదోన్నతులు కల్పించే ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. స్థానిక డీపీటీఓ కార్యాలయంలో సెలక్షన్ కమిటీ 229 మందిని ఎంపిక చేసే కసరత్తును మొదలుపెట్టింది. ఒకటి, రెండు రోజుల్లో పదోన్నతుల ఉత్తర్వులు జారీ చేయబడతాయని అధికారులు తెలిపారు.
News October 20, 2025
ప్రమాదాలు జరిగితే ఈ నంబర్లకు కాల్ చేయండి: SP

మతాబులు కాల్చేటప్పుడు ప్రజలు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ దామోదర్ ఆదివారం సూచించారు. చిన్నపిల్లలు పెద్దల పర్యవేక్షణలో మాత్రమే మతాబులు కాల్చాలని, పాత లేదా తడిసిన మతాబులు వినియోగించరాదని చెప్పారు. కాటన్ దుస్తులు ధరించాలనీ, నైలాన్ లేదా సింథటిక్ దుస్తులు ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు. ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే 101, 100, 112 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
News October 20, 2025
ప్రతి కుటుంబానికి రూ.15వేల లబ్ది: కలెక్టర్

జిల్లాలో సుమారు నెల రోజులుగా కొనసాగిన సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ప్రజలలో విశేష స్పందన వచ్చిందని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదివారం పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆవిష్కరణగా ప్రారంభమైన ఈ పథకం ద్వారా నాలుగు స్లాబుల నుంచి రెండు స్లాబులకు తగ్గించడంతో 98 శాతం ఉత్పత్తులు ధరలు తగ్గాయని తెలిపారు. పారదర్శక పన్ను విధానం ద్వారా ప్రతి కుటుంబానికి ఏడాదికి కనీసం రూ. 15 వేలు లబ్ది చేకూరుతుందన్నారు.