News October 18, 2025
MHBD జిల్లాలో లిక్కర్ షాపులకు 937 దరఖాస్తులు

మహబూబాబాద్ జిల్లాలో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల వివరాలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 61 లిక్కర్ షాపులకు గాను 937 దరఖాస్తులు వచ్చాయని MHBD ఎక్సైజ్ సీఐ చిరంజీవి తెలిపారు.
MHBD 327, తొర్రూర్ 445, గూడూరు 165 కాగా.. మొత్తం 937 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈనెల 18తో గడువు ముగిస్తుందన్నారు.
Similar News
News October 18, 2025
HNK: కాలుష్యాన్ని తుంచి స్వచ్ఛత వెలుగులు పంచాలని..!

దీపావళి అంటే టపాసులు కాల్చి కాలుష్యాన్ని పెంచడం కాదని ఓ రెసిడెన్సీ పాఠశాల విద్యార్థులు చేసిన కార్యక్రమం ఆకట్టుకుంటోంది. దీపావళి వేడుకలకు ప్రతియేటా బాణసంచా వినియోగం పెరిగి, ఫలితంగా పర్యావరణం విపరీతంగా కాలుష్యమవుతోంది. దీంతో టపాసులు కాల్చొద్దని హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలోని ఓ రెసిడెన్సీ పాఠశాలలో శనివారం విద్యార్థినిలు మొక్కను నాటారు. అనంతరం దాని చుట్టూ దీపాలు వెలిగించి పూజలు చేశారు.
News October 18, 2025
మరో వివాదంలో యూసుఫ్ పఠాన్

Ex క్రికెటర్, MP యూసుఫ్ పఠాన్ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. బెంగాల్‌లోని అదీనా మసీదుపై ఆయన చేసిన ట్వీట్ తాజాగా దుమారం రేపింది. ఇది అద్భుత కట్టడమని, సుల్తాన్ సికందర్ నిర్మించారని పోస్ట్ చేయడంపై BJP నేతలు మండిపడుతున్నారు. అది మసీదు కాదని, ఆదినాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసి నిర్మించారని కౌంటర్ ఇస్తున్నారు. ఇటీవల <<17728883>>ప్రభుత్వ స్థలాన్ని<<>> ఆక్రమించారని ఆయనపై GJ హైకోర్టు సీరియస్ అవడం తెలిసిందే.
News October 18, 2025
పేదలకు ఉచిత న్యాయ సలహా: జడ్జి కే. మాధవి

పేదలకు ఉచిత న్యాయ సలహా, సహాయాన్ని అందిస్తామని తాడేపల్లిగూడెం సీనియర్ సివిల్ జడ్జి కే. మాధవి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సూర్యకిరణ్ శ్రీ తెలిపారు. శనివారం పెంటపాడు, గణపవరం పంచాయతీ కార్యాలయాల వద్ద వారు న్యాయ సహాయ సేవా కేంద్రాలను ప్రారంభించారు. న్యాయపరమైన సమస్యలకు ఉచితంగా పరిష్కారం అందిస్తామన్నారు. చిన్న సమస్యలను ‘లీగల్ ఎయిడ్ క్లినిక్’ ద్వారా పరిష్కరించుకోవచ్చని సూచించారు.