News October 18, 2025
అక్టోబర్ 18: చరిత్రలో ఈ రోజు

1931: విద్యుత్ బల్బు ఆవిష్కర్త థామస్ అల్వా ఎడిసన్ మరణం
1968: భారత మాజీ క్రికెటర్ నరేంద్ర హిర్వాణి జననం
1976: కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ మరణం
1978: సినీ నటి జ్యోతిక జననం
1991: భారత మాజీ క్రికెటర్ జయదేవ్ ఉనడ్కట్ జననం
2004: గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ మరణం
2013: రచయిత రావూరి భరద్వాజ(ఫొటోలో) మరణం
Similar News
News October 18, 2025
ఈనెల 27 నుంచి ధాన్యం కొనుగోళ్లు

AP: రాష్ట్రంలో ఈ నెల 27 నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘3,013 రైతు సేవా కేంద్రాలు, 2,061 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, 10,700 మంది సిబ్బందితో సన్నాహాలు చేస్తున్నాం. 51 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు మిల్లర్లు పనిచేయాలి. ధాన్యం 24 గంటల నుంచి 48 గంటల్లోగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తాం’ అని తెలిపారు.
News October 18, 2025
నేడు మద్యం, మాంసం వద్దు! ఎందుకంటే..?

ధన త్రయోదశి పర్వ దినాన మాంసం, మద్యం వంటి తామసిక ఆహారాన్ని తీసుకోకూడదని పండితులు సూచిస్తున్నారు. లేకపోతే లక్ష్మీ కటాక్షం కలగదని అంటున్నారు. ‘నలుపు రంగు వస్తువులు కొనుగోలు చేయకూడదు. గృహోపకరణాలు దానం చేయడం, అమ్మడం వంటివి చేయకండి. నేడు ఎవరికీ రుణం ఇవ్వకూడదు. ఇంట్లో ఏ మూలనా చీకటి లేకుండా, ప్రతి చోట పరిశుభ్రత, దీపాల వెలుగు ఉండేలా చూసుకోవాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది’ అని సూచిస్తున్నారు.
News October 18, 2025
సమ్మె విరమించిన విద్యుత్ ఉద్యోగ సంఘాలు

AP: విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై జేఏసీ నాయకులతో 12 గంటలు సుధీర్ఘంగా జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ప్రధాన డిమాండ్లకు యాజమాన్యాలు ఒప్పుకోవడంతో సమ్మె విరమిస్తున్నట్లు JAC నాయకులు ప్రకటించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేసేందుకు, వారికి నేరుగా ప్రభుత్వం జీతాలు చెల్లించేందుకు అంగీకరించింది. 1999-2004 మధ్య ఎంపికైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానంపై కమిటీకి కూడా అంగీకారం లభించింది.