News October 18, 2025
కామారెడ్డి: నేడే లాస్ట్ డేట్

కామారెడ్డి జిల్లాలోని మొత్తం 49 మద్యం దుకాణాల కోసం శుక్రవారం వరకు 833 దరఖాస్తులు వచ్చాయని కామారెడ్డి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంత రావు తెలిపారు. అప్లికేషన్లకు శనివారం చివరి రోజని ఆయన తెలిపారు. చివరి రోజు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా కామారెడ్డి స్టేషన్ పరిధిలోని 15 షాపులకు 240 దరఖాస్తులు వచ్చాయి.
Similar News
News October 18, 2025
మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్

స్వర్ణాంధ్ర–స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా కర్నూలు నగరంలోని ఏ–క్యాంపు మున్సిపల్ పార్కులో జిల్లా కలెక్టర్ సిరి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ప్రతి వాడ, ప్రతి కాలనీలో పచ్చదనం విస్తరించేలా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
News October 18, 2025
ప్రజా రవాణా వ్యవస్థలను వినియోగించుకోవాలి: కలెక్టర్

ప్రజారవాణా వ్యవస్థలను వినియోగించుకోవాలని కలెక్టర్ విజయ్ కృష్ణన్ పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి కలెక్టరేట్‌లో నిర్వహించిన స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. వాహన కాలుష్యాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సోలార్ విద్యుత్ వినియోగం వంటి పద్ధతులను ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు.
News October 18, 2025
బంగారం నిల్వల్లో ఇండియా రికార్డు!

భారతదేశపు బంగారం నిల్వల విలువ మొదటిసారిగా $100 బిలియన్ మైలురాయిని అధిగమించింది. మొత్తంగా $102 బిలియన్లు దాటినట్లు RBI డేటా పేర్కొంటోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు అనూహ్యంగా పెరగడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. దేశ ఆర్థిక స్థిరత్వానికి ఇదెంతగానో బలం చేకూర్చనుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం RBI విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా 14.7% కి చేరింది.