News October 18, 2025

డిప్యుటేషన్లకు దరఖాస్తు చేసుకోండి: KMR DEO

image

ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి ఇంటర్‌ లోకల్ కేడర్ తాత్కాలిక డిప్యుటేషన్లు/బదిలీలకు ప్రభుత్వం అనుమతించిందని కామారెడ్డి DEO రాజు శుక్రవారం తెలిపారు. ఈ బదిలీలకు అర్హత కలిగిన ఉపాధ్యాయులు, బోధనేతర ఉద్యోగులు OCT 17 నుంచి OCT 24 వరకు schooledu.telangana.gov.in పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. దరఖాస్తు కాపీల (2 సెట్లు) సంబంధిత పత్రాలతో OCT 25 లోపు DEO కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు.

Similar News

News October 18, 2025

ఆసిఫాబాద్ జిల్లాలో గర్భిణీ దారుణ హత్య

image

ఆసిఫాబాద్ జిల్లాలో గర్భిణి మహిళ దారుణ హత్యకు గురైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దహెగాం మండలం గేర్రె గ్రామంలో కోడలు రాణిని మామ సత్తయ్య దారుణంగా హత్య చేశాడు. కొడుకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడనే కోపంతో హత్య చేసి ఉంటాడని గ్రామస్థులు తెలిపారు. హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 18, 2025

మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్

image

స్వర్ణాంధ్ర–స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా కర్నూలు నగరంలోని ఏ–క్యాంపు మున్సిపల్ పార్కులో జిల్లా కలెక్టర్ సిరి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ప్రతి వాడ, ప్రతి కాలనీలో పచ్చదనం విస్తరించేలా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

News October 18, 2025

ప్రజా రవాణా వ్యవస్థలను వినియోగించుకోవాలి: కలెక్టర్

image

ప్రజారవాణా వ్యవస్థలను వినియోగించుకోవాలని కలెక్టర్ విజయ్ కృష్ణన్ పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి కలెక్టరేట్‌లో నిర్వహించిన స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. వాహన కాలుష్యాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సోలార్ విద్యుత్ వినియోగం వంటి పద్ధతులను ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు.