News October 18, 2025
సమ్మె విరమించిన విద్యుత్ ఉద్యోగ సంఘాలు

AP: విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై జేఏసీ నాయకులతో 12 గంటలు సుధీర్ఘంగా జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ప్రధాన డిమాండ్లకు యాజమాన్యాలు ఒప్పుకోవడంతో సమ్మె విరమిస్తున్నట్లు JAC నాయకులు ప్రకటించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేసేందుకు, వారికి నేరుగా ప్రభుత్వం జీతాలు చెల్లించేందుకు అంగీకరించింది. 1999-2004 మధ్య ఎంపికైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానంపై కమిటీకి కూడా అంగీకారం లభించింది.
Similar News
News October 18, 2025
150 లిక్కర్ షాపులకు ఏపీ మహిళ దరఖాస్తు

TG: మద్యం షాపుల దరఖాస్తులు నేటితో ముగిశాయి. మొత్తం 90వేలకు పైగా అప్లికేషన్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఏపీలోని ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఓ మహిళ 150 మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసింది. ఆమె ఏపీకి సరిహద్దు జిల్లాల్లోని షాపులకు ఎక్కువగా దరఖాస్తులు చేసిందని అధికారులు చెబుతున్నారు. యూపీ, కర్ణాటక, ఒడిశా నుంచి కూడా చాలా మంది మహిళలు అప్లై చేసుకున్నారు. ఈనెల 23న లైసెన్స్‌ల కోసం డ్రా నిర్వహించనున్నారు.
News October 18, 2025
USలో యాక్సిడెంట్.. తెలంగాణకు చెందిన తల్లి, కూతురు మృతి

TG: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాలకు చెందిన రమాదేవి(52), తేజస్వి(32) మృతిచెందారు. విఘ్నేష్, రమాదేవి దంపతుల కూతుళ్లు స్రవంతి, తేజస్వి తమ భర్తలు, పిల్లలతో కలిసి USలో ఉంటున్నారు. తేజస్వి ఫ్యామిలీ USలో నూతన గృహ ప్రవేశం చేయగా, కుటుంబ సభ్యులంతా వెళ్లారు. ఆ తర్వాత అందరూ కలిసి స్రవంతి ఇంటికి కారులో వెళ్తుండగా ట్రక్కు ఢీకొట్టింది. రమాదేవి, తేజస్వి ప్రాణాలు కోల్పోగా మిగిలిన వారికి గాయాలయ్యాయి.
News October 18, 2025
CPS అంశాన్ని త్వరలో పరిష్కరిస్తాం: సీఎం

AP: *ఈ దీపావళి లోపు RTC ఉద్యోగుల ప్రమోషన్లు క్లియర్ చేస్తాం
*180 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్ రిటైర్మెంట్ వరకు ఎప్పుడైనా వాడుకోవచ్చు
*పోలీసులకు EL’s కింద NOVలో రూ.105 కోట్లు, జనవరిలో రూ.105 కోట్లు ఇస్తాం
*నాలుగో తరగతి ఉద్యోగుల గౌరవాన్ని పెంచేలా రీ డెసిగ్నేట్
*CPS అంశంపై చర్చించి త్వరలో పరిష్కరిస్తాం
*ఉద్యోగ సంఘాల భవనాల ప్రాపర్టీ టాక్స్ మాఫీ చేస్తాం