News October 18, 2025

ముంబై పోర్ట్ అథారిటీలో 116 పోస్టులు

image

ముంబై పోర్ట్ అథారిటీ 116 గ్రాడ్యుయేట్, COPA అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతగల అభ్యర్థులు నవంబర్ 10 వరకు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్(COPA) 105, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు 11 ఉన్నాయి. అభ్యర్థుల వయసు 14 నుంచి 18 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.100. వెబ్‌సైట్: https://mumbaiport.gov.in/

Similar News

News October 18, 2025

కెప్టెన్సీ కోల్పోతాననే భయం ఉంది: సూర్య

image

కెప్టెన్సీ కోల్పోతాననే భయం తనలో ఉందని IND T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వెల్లడించారు. T20లకూ గిల్‌ను కెప్టెన్ చేస్తారన్న ఊహాగానాలపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘నేను అబద్ధం చెప్పను. భయం ఉంటుంది. అదే నాకు మోటివేషన్. హార్డ్‌వర్క్ చేస్తూ నిజాయతీగా ఉంటే మిగతావన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. టెస్ట్, వన్డేలకు గిల్ కెప్టెన్ అవడం పట్ల హ్యాపీగా ఉన్నా. మా మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది’ అని పేర్కొన్నారు.

News October 18, 2025

రుషికొండ ప్యాలెస్‌ వినియోగంపై తర్జనభర్జన

image

AP: విశాఖలోని <<17985023>>రుషికొండ<<>> ప్యాలెస్‌పై వివిధ ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయి. అంతర్జాతీయ కాన్సులేట్‌లు ఏర్పాటు చేయాలని ఏపీ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ సూచించింది. ఏపీ నుంచి వేలాది మంది US, UAE సహ పలు దేశాల్లో నివసిస్తున్నందున NRI సేవలు సులభమవుతాయంది. లేకుంటే అంతర్జాతీయ హోటళ్లు నెలకొల్పాలని పేర్కొంది. దాదాపు ₹500 Crతో కట్టిన ఈ ప్యాలెస్ వినియోగం లేకపోగా, నిర్వహణ ఖర్చులకు నెలకు ₹25లక్షలు అవుతోంది.

News October 18, 2025

అఫ్గాన్ ఆడకున్నా సిరీస్‌ కొనసాగుతుంది: PCB

image

పాక్ వేదికగా జరిగే ముక్కోణపు టీ20 సిరీస్ నుంచి <<18038169>>తప్పుకుంటున్నట్లు<<>> అఫ్గాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిరీస్ షెడ్యూల్ ప్రకారమే (Nov 17-29) కొనసాగుతుందని PCB వెల్లడించింది. అఫ్గాన్ స్థానంలో ఇంకో జట్టును ఆడించేందుకు పలు బోర్డులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు PCB వర్గాలు తెలిపాయి. పాక్, శ్రీలంకతోపాటు మూడో జట్టు పేరు ఖరారు కాగానే అధికారికంగా వెల్లడిస్తామని చెప్పాయి.