News October 18, 2025

DRDO PXEలో 50 అప్రెంటిస్‌లు

image

DRDOకు చెందిన ప్రూఫ్ అండ్ ఎక్స్‌పరిమెంటల్ ఎస్టాబ్లిష్‌మెంట్(PXE) 50 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిప్లొమా, బీటెక్, బీఈ అర్హత గలవారు ఈనెల 19 వరకు training.pxe@gov.in మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్‌లో ఎన్‌రోల్ చేసుకోవాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.drdo.gov.in

Similar News

News October 19, 2025

Alert: దీపావళికి స్వీట్లు కొంటున్నారా?

image

TG: దీపావళి పండుగ సందర్భంగా స్వీట్లు కొంటున్న వారికి అలర్ట్. రాష్ట్రంలోని పలు స్వీట్ షాపుల్లో సింథటిక్ కలర్స్, ఫేక్ సిల్వర్ ఫాయిల్, రీయూజ్డ్ ఆయిల్, కల్తీ నెయ్యి వాడుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో తేలింది. కనీస పరిశుభ్రత పాటించకుండా, కాలం చెల్లిన పదార్థాలతో స్వీట్లు తయారు చేస్తున్నట్లు వెల్లడైంది. దీంతో షాపుల్లో క్వాలిటీని చూసి స్వీట్లు కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

News October 19, 2025

రాష్ట్రానికి ప్రధాన రథచక్రాలు ఉద్యోగులే: CM

image

AP: ఉద్యోగులకు దీపావళి వేళ శుభవార్త చెప్పాలనే ఉద్దేశంతోనే వారితో సమావేశమైనట్లు CM చంద్రబాబు తెలిపారు. ‘ఉద్యోగులు సంతోషంగా ఉండి అంతా కలిసి పనిచేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రానికి ప్రధాన రథచక్రాలు ఉద్యోగులే. పాలసీలు మేం తీసుకువచ్చినా వాటిని అమలు చేసే బాధ్యత వారిదే. ఉద్యోగులు, NDA కార్యకర్తలు ఎవరు తప్పు చేసినా ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తుంది’ అని మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

News October 19, 2025

కల్తీ/అసలైన వెండిని ఇలా గుర్తించండి!

image

*వెండిపై ఉండే హాల్ మార్క్‌ను టెస్టు చేయాలి. 925 ఉంటే వెండిలో 92.5% ప్యూర్ సిల్వర్, 7.5% రాగి ఉన్నట్టు లెక్క. 999 ఉంటే 99.9% ప్యూర్ అని అర్థం.
*వెండి దగ్గర అయస్కాంతం పెడితే అతుక్కోదు. నకిలీ వెండి అతుక్కుంటుంది.
*వెండికి అధిక ఉష్ణ వాహకత (Thermal conductivity)ఉంటుంది. వెండిపై మంచు ముక్క పెడితే త్వరగా కరిగిపోతుంది.
*వెండిని మరో వెండి ముక్కతో కొడితే క్లియర్ సౌండ్ వస్తుంది.