News October 18, 2025
GHMCలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

TG: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)లో 17 ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. సీనియర్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్, మైక్రో బయాలజిస్ట్, ఎంటమాలజిస్ట్, వెటర్నరీ ఆఫీసర్, ఫుడ్ సేఫ్టీ ఎక్స్‌పర్ట్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, MBBS, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
Similar News
News October 18, 2025
మినుములో మారుకా పురుగు.. వేపనూనెతో చెక్

మినుము మొగ్గ, పిందె దశలలో మారుకా మచ్చల పురుగు ఆశించి నష్టం కలిగిస్తుంది. ఒక తల్లి పురుగు 200-500 గుడ్లను పెడుతుంది. వాటి లార్వాలు బయటకు వచ్చి మొగ్గలు, పిందెలను తినేస్తాయి. దీంతో దిగుబడి తగ్గిపోతుంది. ఈ పురుగు నివారణకు 5మి.లీ వేప నూనె లేదా నొవల్యూరాన్ 1.0మి.లీ లేదా క్లోరిపైరిఫాన్ 2.5 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. 5-10 రోజుల వ్యవధిలో ఈ మందులను మార్చి పిచికారీ చేయాలి.
News October 18, 2025
చీర కట్టినప్పుడు పొడవుగా కనిపించాలంటే..

కాస్త ఎత్తు తక్కువగా ఉండి, లావుగా ఉన్నవారు కొన్ని టిప్స్ పాటిస్తే చీర కట్టుకున్నప్పుడు పొడవుగా, అందంగా కనిపిస్తారంటున్నారు ఫ్యాషన్ నిపుణులు. మృదువైన సిల్కు ప్లెయిన్ చీరకు చిన్న అంచు ఉన్నవి ఎంచుకోవాలి. దీనిపై మీడియం ప్రింట్స్ ఉన్న బ్లౌజ్ వెయ్యాలి. డీప్‌నెక్ బ్లౌజ్ వేసుకోవాలి. పెద్ద బోర్డర్లున్న చీరలు, పెద్ద ప్రింట్స్ ఉన్నవి ఎంచుకోకూడదు. నెక్ విషయానికొస్తే హైనెక్, క్లోజ్ నెక్‌కు దూరంగా ఉండాలి.
News October 18, 2025
రాష్ట్రంలో 34 ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<