News April 8, 2024

BREAKING: పరీక్షలు వాయిదా

image

దేశంలో ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు జరగాల్సిన పలు పరీక్షలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) <>రీషెడ్యూల్<<>> చేసింది. జూనియర్ ఇంజినీర్ పరీక్షలను జూన్ 5, 6, 7 తేదీల్లో, సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ ఫేజ్-XII 2024 పరీక్షలను జూన్ 24, 25, 26 తేదీల్లో, ఢిల్లీ పోలీస్(SI, CAPF) పరీక్షలను జూన్ 27, 28, 29 తేదీల్లో, CHSL(10+2) పరీక్షలను జూలై 1, 2, 3, 4, 5, 8, 9, 10, 11, 12 తేదీల్లో నిర్వహిస్తామంది.

Similar News

News October 9, 2024

కేంద్రం బ్యాన్ చేసిన యాప్.. ఎన్నికల సంఘం వాడుతోంది!

image

కేంద్రం 2020లో 59 చైనా యాప్స్‌ను బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. డాక్యుమెంట్లను కెమెరాతో స్కాన్ చేసి పీడీఎఫ్ ఫైల్స్‌లా సేవ్ చేసుకునేందుకు ఉపకరించే క్యామ్‌స్కానర్ కూడా వాటిలో ఉంది. దీన్నుంచి కూడా చైనాకు సమాచారం వెళ్తోందన్న ఆరోపణలున్నాయి. అలాంటి ఈ యాప్‌ను స్వయంగా కేంద్ర ఎన్నికల సంఘమే వాడుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఓ నెటిజన్ ఈ విషయాన్ని గుర్తించి పోస్ట్ పెట్టగా దానిపై చర్చ జరుగుతోంది.

News October 9, 2024

GREAT: 18 ఏళ్లకే ఎత్తైన శిఖరాలన్నీ ఎక్కేశాడు!

image

నేపాల్‌కు చెందిన నిమా రింజీ షెర్పా చరిత్ర సృష్టించారు. ప్రపంచంలో 8వేల మీటర్లకంటే ఎత్తున్న 14 శిఖరాలనూ 18 ఏళ్లకే అధిరోహించారు. బుధవారం ఉదయం టిబెట్‌లోని 8027 మీటర్ల ఎత్తున్న శీష పంగ్మా పర్వత శిఖరాన్ని చేరుకోవడం ద్వారా ఈ రికార్డును అందుకున్నారు. ఈ పర్వత శిఖరాలను సమీపించేకొద్దీ మనిషికి సరిపడా ఆక్సిజన్ ఉండదు. ఈ నేపథ్యంలో ఈ 14 శిఖరాలను అధిరోహించడాన్ని పర్వతారోహకులు గొప్పగా చెబుతారు.

News October 9, 2024

రోహిత్ వల్లే గెలిచాం.. గంభీర్‌ను పొగడటం ఆపండి: గవాస్కర్

image

బంగ్లాదేశ్‌తో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌లో రెండో మ్యాచ్‌ను భారత్ అద్భుత రీతిలో గెలిచిన సంగతి తెలిసిందే. దానిపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం రోహిత్ కెప్టెన్సీ వల్లే ఆ గెలుపు సాధ్యమైందని తేల్చిచెప్పారు. కొంతమంది ఆ క్రెడిట్‌ను గంభీర్‌కు కట్టబెట్టి అతడి బూట్లు నాకుతున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ వర్గాల్లో ఆయన మాటలు చర్చనీయాంశంగా మారాయి.